ఓ మంత్రి కాన్వాయ్‌లోని పైలట్ వాహనం అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ బోల్తా పడింది. అందులోని ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం..
సాధారణంగా రోడ్డుపై వాహనాలు వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అయితే అంబులెన్స్ రోడ్డుపై వెళ్తున్నపుడు ఏ వాహనాలైనా దారి వదాలాల్సిందే. ఎందుకంటే అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లు అంబులెన్స్ లో ఉంటారు. వారు ఎమర్జెన్సీ సేవలు అందించాల్సి ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ ఓ మంత్రి కాన్వాయ్‌లోని పైలట్ వాహనం.. అంబులెన్స్‌ను ఢీకొంది. దీంతో అంబులెన్స్ బోల్తాపడి.. ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం..
గత రెండు రోజుల క్రితం బుధవారం నాడు కేరళ విద్యాశాఖ మంత్రి వి శివన్‌కుట్టి కొట్టాయం నుంచి తిరువనంతపురానికి వెళుతుండగా తన కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. కొట్టారకరలోని పులమన్ జంక్షన్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జంక్షన్ క్రాస్ చేస్తుండగా వేరే మార్గంలో అంబులెన్స్ వస్తుండడంతో కాన్వాయ్ పైలట్ వాహనం అంబులెన్స్‌ను ఢీ కొట్టింది. తర్వాత ఓ బైక్‌ని కూడా ఢీకొట్టింది. బైకర్ స్పీడ్ తగ్గించి, బైక్ ఆపివేయడంతో ప్రమాదం తప్పింది. దానితో ఆగకుండా అక్కడున్న ట్రాఫిక్ కానస్టేబుల్ మీదకు దూసుకొచ్చింది. కానిస్టేబుల్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయ్ వెళ్లేందుకు ట్రాఫిక్ ను నిలిపివేయడం వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వాహనాలు నిలిపి వేయడంతో వేరే వైపు నుండి అంబులెన్స్ వచ్చింది. ప్రమాదంలో గాయపడిన వారిని పట్టించుకోకుండా మంత్రి జంపవడం గనించదగ్గ విషయం.
Kerala Education Minister V Sivan Kutty’s pilot vehicle crashed against an ambulance near Kottarakara in Kollam district. 3 were injured in this accident. pic.twitter.com/l3ROkGd2sn
— Bharat । भारत । ਭਾਰਤ (@RealBharatB) July 13, 2023