ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ప్రచారం సాగుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ బృందం వివరణ ఇచ్చింది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార వైసీపీకి భారీ షాక్ తగిలిన సంగతి తెలిసిందే. తూర్పు రాయలసీమ స్థానం నుంచి కంచర్ల శ్రీకాంత్.. ఉత్తరాంధ్ర స్థానం నుంచి వేపాడ చిరంజీవిరావు టీడీపీ తరఫున బరిలో నిలిచి గెలిచారు. ఇక మిగిలిన పశ్చిమ రాయలసీమ స్థానంలో హోరా హోరీగా కౌంటింగ్ సాగుతుండగా.. రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం అందరి కళ్లు దీనిపైనే ఉన్నాయి. ఇక తూర్పు రాయలసీమ ప్రాంతంలో టీడీపీ విజయం సాధించినప్పటికి.. చంద్రబాబు నాయుడు కంచుకోట కుప్పంలో మాత్రం వైసీపీకి అధిక ఓట్లు పోలయ్యాయి అంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా మరో ప్రచారం తెర మీదకు వచ్చింది. అది కూడా కౌంటింగ్ కొనసాగుతున్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన వార్త కావడంతో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల పోలింగ్‌కు సంబంధించిన వార్త ఒకటి తెగ వైరలవుతోంది. అది ఏంటంటే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కంటే టీడీపీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయని తెగ ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు, ట్వీట్‌లు వైరల్ అవుతున్నాయి.. దీంతో ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఈ వార్తలపై స్పందించింది. ఆ ప్రచారం వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వాదన పూర్తిగా నిరాధారమని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ బృందం తేల్చి చెప్పింది.
In MLC elections, counting is not done constituency wise like MLA elections. All the votes are mixed and then counted.
This claim on social media is absolutely baseless.
Final numbers will be announced by Election Commission, till then don’t believe such fake news. pic.twitter.com/Y1m8yOTdzP
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) March 17, 2023
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చింది ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం. ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్.. ఎమ్మెల్యె ఎన్నికల కౌంటింగ్‌లా నియోజకవర్గాల వారీగా జరగదని చెప్పుకొచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విడివిడిగా కాకుండా పోలైన ఓట్లన్నీ కలిపే లెక్కిస్తారని స్పష్టం చేసింది. త్వరలో ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ఫలితాలకు సంబంధించి తుది వివరాలను ప్రకటిస్తుందని.. ఈ లోగా ఇలాంటి అసత్య వార్తలను నమ్మొద్దని కోరింది ఫ్యాక్ట్ చెక్ విభాగం.
మరోవైపు పులివెందులతో పాటూ కుప్పం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలంటూ సోషల్ మీడియాలో వైరలవుతోన్న పోస్టులు ఇలా ఉన్నాయి. కుప్పం మాదే పులివెందుల మాదే అంటూ టీడీపీ శ్రేణులు ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు. అలాగే టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్లు బుచ్చయ్య చౌదరి కూడా దీనిపై ట్వీట్ చేశారు. ‘‘సీఎం జగన్‌కి భారీ షాక్ ఇచ్చిన పులివెందుల పట్టభద్రులు…!! TDP -4,323, YSRCP- 2,120, ఇతరులు – 123’’ అంటూ ట్వీట్ చేశాడు.
Breaking News…
జగన్ కి భారీ షాక్ ఇచ్చిన పులివెందుల పట్టభద్రులు…!!
TDP -4,323
YSRCP- 2,120
ఇతరులు – 123#ByeByeJagan— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) March 17, 2023
ఇక ఏపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది.. రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు నడుస్తోంది. మరి ఇక్కడ ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.