ఏదైనా పెద్ద ప్రమాదం జరిగినప్పుడు వెంటనే.. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రమాదానికి కారణం వారే అంటూ ఒక వర్గంపై మరొక వర్గం దుష్ప్రచారం చేస్తుంటారు. రీసెంట్ గా ఒడిశా రైలు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారని పోస్టులు పెడుతున్నారు. ఇందులో నిజమెంత?
ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ప్రచారం సాగుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ బృందం వివరణ ఇచ్చింది. ఆ వివరాలు..
మోసం చేయాలనుకోవాలే గానీ మోసగాళ్లకు లేని దారంటూ లేదు. దొరికిన ఏ మార్గాన్ని వదిలిపెట్టరు. ఇప్పుడు ప్రభుత్వ పథకాల పేరుతో జనాన్ని మోసం చేయడం ట్రెండ్ అయిపోయింది. మోసగాళ్లు కూడా ట్రెండ్ కి తగ్గట్టు అప్ డేట్ అవుతున్నారు. ‘ప్రభుత్వ ఉద్యోగం, లక్షల్లో జీతం అని టెంప్టింగ్ ఆఫర్ తో ఈ కింది లింక్ క్లిక్ చేయండి’ అంటూ నకిలీ సందేశాలు మీకు వస్తున్నాయా? అయితే జర జాగ్రత్త. కేంద్ర ప్రభుత్వ పథకం పేరిట ఒక నకిలీ […]
ఓ వైపు ఇంధన ధరలు, మరోవైపు నిత్యవసర ధరలు పెరిగి సామాన్యుడికి పెను భారంగా మారాయి. రోజు గడవాలంటే వందలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇక కూరగాయలు, ఆకు కూరలు కొనే పరిస్థితి లేదు. మాంసం ధరలు కొండెక్కాయి. ఇక టమాటా అయితే ఏకంగా సెంచరీ దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో కాస్త స్థితిమంతులు సైతం.. కేజీల లెక్కన భారీగా కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు మేం చెప్పబోయే కాయగూర రేటు వింటే.. […]