ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చాయి. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడం సంచలనంగా మారింది. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అయితే ఈ క్రాస్ ఓటింగ్ కు కారణం చంద్రబాబు అని.. చంద్రబాబే తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని సజ్జల ఆరోపించారు.
ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏపీలో రాజకీయం వెెేడెక్కింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై వైసీపీ చర్యలు తీసుకుంది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వారిలో ప్రముఖంగా ఉండవల్లి శ్రీదేవి పేరు వినిపిస్తోంది. ఇందుకే సీఎం చర్యలు తీసుకున్నారు అంటూ పలు కారణాలు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త కుంపటిని రాజేసినట్లు అయ్యింది. వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో ఒక ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ విజయం సాధించింది. ఈ క్రాస్ ఓటింగ్ ఘటను సీరియస్ తీసుకున్న పార్టీ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు. తానే క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదంటూనే పార్టీ టికెట్ విషయంలో తన అసంతృప్తిని వెళ్లగక్కారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ముఖ్యమే అన్న విషయం మనందరికి తెలిసిందే. ప్రతి అభ్యర్థి గెలవాలన్న ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ అధిష్టానం. అలానే తనపై నమ్మకం పెట్టుకున్న అధిష్టానంపై ఓ వైసీపీ ఎమ్మెల్యే విధేయత చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందనే విషయం స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ వివరాలు..
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో షాకింగ్ ఫలితాలు వెలువడ్డ సంగతి అందరికీ విదితమే. మొత్తం 7 సీట్లకు ఎన్నికలు జరగగా. 6 సీట్లను వైసీపీ, ఒక్క సీటును టీడీపీ గెలుచుకున్నాయి. గెలిచేందుకు తగినంత మెజార్టీ లేకపోయినప్పటికీ.. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ అనూహ్యంగా విజయం సాధించారు.