దివంగత మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం సంచలనం మారింది. పులివెందుల అంతటా బంద్ వాతావరణం కనిపిస్తోంది. వ్యాపారులు స్వచ్చందంగా షాపులు మూసేసి బంద్ పాటిస్తుండగా.. వైసీపీ నేతలు, కార్యకర్తలు శాంతియుతంగా నిరసనలు చేపడుతున్నారు.
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. కొంతమంది లైసెన్స్ లేని గన్స్ అక్రమంగా కొనుగోలు చేసి బెదిరింపులకు పాల్పపడుతున్నారు. రియల్ ఎస్టేట్, ఇతర ఆర్థిక లావా దేవి విషయాల్లో ఎదుటి వారిని బెదిరించడానికి గన్స్ ఉపయోగిస్తున్నారు. కొన్నిసార్లు తుపాకీ కాల్పుల్లో చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి.
ఏపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ ప్రచారం సాగుతోంది. దీనిపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ బృందం వివరణ ఇచ్చింది. ఆ వివరాలు..
ఇతనికి రెండేళ్ల కిందటే భారతి అనే మహిళతో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతుల సంసారం బాగానే గడిచింది. ఈ క్రమంలోనే అతడు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల ఓ రోజు రాత్రి ప్రియురాలి ఇంటికి వెళ్లి.. తెల్లారేసరికి ఊహించని స్థితిలో కనిపించాడు. అసలేం జరిగిందంటే?
అత్త లేని కోడలుత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అని ఒక సామెత ఉంది. ఈ సామెత చాలా చోట్ల అమలవుతూనే ఉంది. అత్తా, కోడలు అంటే ఇండియా-పాకిస్తాన్ అనేంతగా ఉండే సమాజం ఆఫ్ ఇండియాలో.. కోడలిని కూతురిలా చూసుకునే అత్త గార్లు, అత్తగారిలో అమ్మని చూసుకునే కోడళ్ళు కూడా ఉంటారు. సీరియల్స్ లో కాదు.. నిజ జీవితంలో ఉంటారు. కోడలిగా తాను అత్తగారి చేతిలో అనుభవించిన టార్చర్ తన కోడలు అనుభవించకూడదు అని అనుకోకుండా.. ఆమెకు […]
పులివెందుల ప్రజలకు ఏపీ సీఎం జగన్ వరుస గిఫ్ట్ లు ఇస్తున్నారు. ఇప్పటికే అత్యాధునిక హంగులతో పులివెందుల బస్టాండ్ ని నిర్మించిన జగన్ సర్కార్.. తాజాగా మరో అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. పులివెందులలోని కేబుల్ బ్రిడ్జ్ ని నియోజకవర్గ ప్రజలకు బహుమతిగా ఇవ్వనున్నారు. పులివెందులలో సరైన బస్టాండ్ లేక ఇక్కట్లు పడుతున్న ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన బస్టాండ్ ను నిర్మించి బహుమతిగా ఇవ్వనున్నారు. అదే ఊపులో మిరిమిట్లు గొలిపే కాంతులను విరజిమ్మే కేబుల్ బ్రిడ్జ్ […]
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం అయిన పులివెందుల అంటే ఎలా ఉండాలి. రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాలి కదా. కానీ అలా ఉందా? ఉండకపోగా ఊరిలో ఒక బస్టాండ్ లేదు. ప్రయాణికులు కూర్చోడానికి కాదు కదా కనీసం నిలబడడానికి కూడా సౌకర్యం లేదు. తాటాకులతో ఏదో నామమాత్రంగా ఉంది అంటే ఉంది. గట్టిగా గాలి వీస్తే పడిపోయేలా ఉంది. ఇవి ఒకప్పుడు పులివెందుల బస్టాండ్ గురించి, జగన్ గురించి తక్కువ చేసి మాట్లాడిన […]
కాలం మారుతోంది.. కాలంతో పాటు మనుషులూ మారుతున్నారు.. మనిషితో పాటు ఆలోచనలూ మారుతున్నాయి. ఈ ఆలోచనలతోనే మాట మారుస్తున్నాడు నేటి మానవుడు. తనకు దక్కేదాక ఒక మాట.. దక్కినాక మరో మాట చెప్తూ నమ్మిన వారిని మోసం చేయడం నేటి సమాజంలో ఓ అలవాటుగా మారింది. తాజాగా ఓ ప్రబుద్దుడు అమ్మాయి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వదిలేశాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. SI దస్తగిరి తెలిపిన వివరాల ప్రకారం.. పులివెందులకు […]
వైఎస్సార్ జిల్లా, పులివెందులకు చెందిన వైసీపీ నేత, జగన్ సమీప బంధువు వైఎస్ కొండా రెడ్డిని జిల్లా నుంచి బహిష్కరిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మేరకు ఎస్పీ.. కలెక్టర్‌కు సిఫారసు చేసినట్లు సమాచారం. సీఎం జగన్ ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎస్‌ఆర్‌కే కన్‌స్ట్రక్షన్స్ బెదిరింపుల ఘటనకు సంబంధించి లక్కిరెడ్డిపల్లె కోర్టులో ఆయనకు బెయిల్ మంజూరైన కొద్దిసేపటికే ఇలాంటి వార్తలు రావడంతో వైసీపీ పార్టీలో కాస్త అలజడి రేగింది. వైఎస్ కొండారెడ్డి స్వతహాగానే దూకుడు స్వభావం గల […]
కడప జిల్లాలో మొదటి నుంచి వైఎస్ కుటుంబం హవా బలంగా ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పటికి.. కడపలో మాత్రం వైఎస్ కుంటుంబమే విజయం సాధిస్తూ వస్తోంది. వైసీపీకి కంచుకోటలా మారింది. ఇక ప్రస్తుతం ఏపీలో టీడీపీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం చవి చూసింది. ఓటమి తరువాత చాలా మంది టీడీపీ నేతలు పార్టీకి దూరం అయ్యారు.. కొందరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం చాలా జిల్లాల్లో టీడీపీకి […]