ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజ్ అయినటువంటి కొత్త సినిమాల పరిస్థితులను గెస్ చేయడం చాలా కష్టంగా మారింది. హిట్టు, ఫట్టు అనేది పక్కన పెడితే.. ఊహించని ఫలితాలను అందుకొని.. అంతే వేగంగా ఓటిటిలోకి వచ్చేస్తున్నాయి సినిమాలు. అసలే కరోనా తర్వాత థియేటర్లకు రావడం తగ్గించేశారు జనాలు. ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి బిగ్ స్టార్స్ సినిమాలకు తప్పితే.. పెద్దగా థియేటర్లకు రావడం లేదనే చెప్పాలి. అందుకే వచ్చిన సినిమాలు వీలైనంత త్వరగా ఓటిటిలో సైతం రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
ఇటీవలే టాలీవుడ్ హీరో నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘థ్యాంక్యూ’ విడుదలైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో రాశిఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా నటించారు. ఇక లవ్ అండ్ ఎమోషనల్ జానర్ లో రూపొందిన ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థలైన అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే.. సినిమా ప్రస్తుతం థియేట్రికల్ రన్ అవుతోంది.
ఈ నేపథ్యంలో సినిమా ఓటిటి స్ట్రీమింగ్ కి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక థ్యాంక్యూ మూవీ ఆగష్టు 12 నుండి అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్ లో ఒకేసారి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. నాగచైతన్య ఇప్పుడు సోలో హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. మజిలీ తర్వాత లవ్ స్టోరీతో పరవాలేదనిపించాడు. బంగార్రాజు వచ్చేసరికి నాగార్జున లీడ్ రోల్ కాబట్టి ఆ హిట్ ఆయన ఖాతాలో పడింది. మరి థ్యాంక్యూ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.