ఈ వారం ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు దాదాపుగా 20కి పైగా సినిమాలు వచ్చేస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గతవారం సందడి అంతా ‘ఆదిపురుష్’దే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ యాక్ట్ చేసిన ఈ మూవీ లాస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ వసూళ్లలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగు నాట చాలా చోట్ల నాన్ ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులను తుడిచేసింది. అయితే మొదటి సోమవారం మాత్రం ‘ఆదిపురుష్’ కలెక్షన్స్ భారీగా డ్రాప్ అయ్యాయి. దీనికి నెగెటివిటీనే కారణమని ట్రేడ్ అనలిస్టులు అంటున్నారు. ఈ మూవీ రిజల్ట్ గురించి పక్కనబెడితే.. ఈ వారం బిగ్ స్క్రీన్స్‌లోకి వచ్చే మూవీస్ పెద్దగా లేవు. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమే అన్నట్లుగా దీనికి సంబంధించి ఒక ఫుల్ లిస్ట్ బయటకు వచ్చింది.
ఈ వారంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా.. 20కి పైగా కొత్త చిత్రాలు ఈ వీక్‌లోనే స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ సినిమాల లిస్టులో ‘ది కేరళ స్టోరీ’, ‘ఇంటింటి రామాయణం’, ‘జాన్ విక్ 4’ తదితర మూవీస్ ఉండటం విశేషం. ముఖ్యంగా బాగా వివాదాస్పదంగా మారిన ‘ది కేరళ స్టోరీ’ మూవీని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వారంలో విడుదలవుతున్న ఓటీటీ చిత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
టీకూ వెడ్స్ షేరు – హిందీ మూవీ – జూన్ 23
పొన్నియిన్ సెల్వన్ – హిందీ డబ్బింగ్ వెర్షన్ – జూన్ 23
స్కల్ ఐలాండ్ – ఇంగ్లీష్ వెబ్ సిరీస్ – జూన్ 22
స్లీపింగ్ డాగ్ – ఇంగ్లీష్ వెబ్ సిరీస్ – జూన్ 22
గ్లామరస్ – ఇంగ్లీష్ వెబ్ సిరీస్ – జూన్ 22
ఐ నంబర్ నంబర్: జోజి గోల్డ్: ఇంగ్లీష్ ఫిలిం – జూన్ 23
టేక్ కేర్ ఆఫ్ మాయ – ఇంగ్లీష్ మూవీ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
త్రూ మై విండో – ఇంగ్లీష్ సినిమా – జూన్ 23
నాట్ క్వైట్ నార్వల్ – ఇంగ్లీష్ వెబ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
క్యాచింగ్ కిల్లర్స్ వెబ్ సిరీస్: సీజన్-3 – ఇంగ్లీష్ డాక్యుమెంటరీ – జూన్ 23
సీక్రెట్ ఇన్వేషన్ – ఇంగ్లీష్ సిరీస్ – జూన్ 21
క్లాస్ ఆఫ్ ’09 – ఇంగ్లీష్ వెబ్ సిరీస్ – జూన్ 21
జాగ్డ్ మైండ్ – ఇంగ్లీష్ మూవీ – జూన్ 23
వరల్డ్స్ బెస్ట్ – ఇంగ్లీష్ మూవీ – జూన్ 23
కేరళ క్రైమ్ ఫైల్స్ – మలయాళ చిత్రం – జూన్ 23
ఇంటింటి రామాయణం – తెలుగు చిత్రం – జూన్
ద కేరళ స్టోరీ – తెలుగు డబ్బింగ్ మూవీ – జూన్ 23
కిసీ కా భాయ్ కిసీ కా జాన్ – తెలుగు డబ్బింగ్ వెర్షన్ – జూన్ 23
ఏజెంట్ – తెలుగు చిత్రం – జూన్ 23
జాన్ విక్ ఛాప్టర్ 4 – ఇంగ్లీష్ మూవీ – జూన్ 23
ఫ్లై ఓవర్ – బెంగాలీ సినిమా – జూన్ 23