సమంత, నాగ చైతన్య ఇద్దరూ విడిపోయి ఎవరి లైఫ్ వాళ్లు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. అయితే చైతన్య, బ్యూటిఫుల్ తెలుగు యాక్ట్రెస్ శోభిత ధూళిపాళ్ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనే న్యూస్ ఒకటి అప్పుడప్పుడు దర్శనమిస్తుంటుంది. ఆమధ్య వీరిద్దరూ కలిసున్న పిక్ ఒకటి ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే.
సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్, రూమర్లకు అంతే ఉండదు. రాత్రి వర్షం పడితే ఉదయాన్నే మట్టి మీద పుట్టగొడుగులు మొలిచినట్లు పుకార్లు పుట్టుకొచ్చేస్తుంటాయి. ఒక్కోసారి నిజమేనని నమ్మేంతలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటాయి. ఇక సోషల్ మీడియా వేదికగా వచ్చే గాసిప్స్, రూమర్లకైతే హద్దు, అదుపూ ఉండదు. స్వయంగా సెలబ్రిటీలు రంగంలోకి దిగి క్లారిటీ ఇస్తేనే కానీ కాంట్రవర్సీలకు, వివాదాలకు ఫుల్ స్టాప్ పడదు. ఇక సమంత – నాగ చైతన్య విడిపోయినప్పటి నుండి ఎన్నేసి వార్తలు వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ఇటీవల సామ్ మయోసైటిస్ బారినపడినప్పుడు కూడా పలు వార్తలు వచ్చాయి. ఇద్దరూ విడిపోయి ఎవరి లైఫ్ వాళ్లు హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. అయితే చైతన్య, బ్యూటిఫుల్ తెలుగు యాక్ట్రెస్ శోభిత ధూళిపాళ్ల మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ అనే న్యూస్ ఒకటి అప్పుడప్పుడు దర్శనమిస్తుంటుంది. ఆమధ్య వీరిద్దరూ కలిసున్న పిక్ ఒకటి ఎంతలా వైరల్ అయిందో తెలిసిందే.
తర్వాత అది ఫోటోషాప్ చేసిన ఇమేజ్ అని తెలిసింది. శోభిత కూడా ఆ రూమర్లను ఖండించింది. అయినా అడపా దడపా వార్తలు వస్తూనే ఉన్నాయి. ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి సినిమాలతో ఆకట్టుకున్న శోభిత హిందీలోనూ యాక్ట్ చేసింది. ఇటీవల తమిళంలో ‘పొన్నియన్ సెల్వన్’ లోనూ కనిపించింది. తెలుగమ్మాయి అయినా బాలీవుడ్లో మూవీస్, వెబ్ సిరీస్ చేస్తూ బిజీబిజీగా ఉంది. రీసెంట్గా సమంత – నాగ చైతన్యల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిందామె. అనిల్ కపూర్, ఆదిత్య రాయ్ కపూర్, శోభిత ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది నైట్ మేనేజర్’ వెబ్ సిరీస్ సీజన్ 2 ఈనెల 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీంతో టీమ్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ మీడియాకిచ్చిన ఇంటర్వూలో శోభితను సామ్ అండ్ చై గురించి అడగ్గా తన స్టైల్లో కూల్‌గా ఆన్సర్ ఇచ్చింది.
అయితే చైతుతో తన రిలేషన్ గురించిన విషయంపై మళ్లీ మాట్లాడలేదామె.నాగ చైతన్య గురించి చెప్పాలని అడగ్గా.. ‘చైతన్య చాలా హుందాగా, కూల్‌గా ఉంటాడు.. అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు.. అందరితోనూ మంచిగా ఉంటాడు’ అని చెప్పింది. ఇక సమంత గురించి అడిగితే.. ‘సామ్ జర్నీ చాలా కూల్‌గా సాగిందనుకుంటున్నాను.. తన సినిమాల సెలక్షన్ అద్భుతంగా ఉంటుంది.. తన మూవీస్ బాగుంటాయి.. ఇప్పుడామె ఎంత పెద్ద సినిమానైనా హ్యాండిల్ చెయ్యగలదు అనుకుంటున్నాను’ అని సమాధానమిచ్చింది శోభిత ధూళిపాళ్ల. ఇక నార్త్‌తో పాటు అన్ని చోట్ల నుండి ‘ది నైట్ మేనేజర్’ ఫస్ట్ సీజన్‌కి మంచి ఆదరణ దక్కింది. దీంతో సెకండ్ సీజన్ కోసం ఆడియన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. వారి అంచనాలకు మించి ‘ది నైట్ మేనేజర్ 2’ ఉంటుందని కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు టీం.