ఓటీటీ ప్లాట్ ఫాం అందుబాటులోకి వచ్చాక కొత్త సినిమాలు విడుదలైన రెండు మూడు వారాల్లోనే ఓటీటీల్లోకి విడుదలవుతూ సినిమా లవర్స్ ను వినోదాన్ని పంచుతున్నాయి. ఇంటర్నెట్ సహాయంతో తమకు వీలున్నప్పుడల్లా సినిమాను చూసే అవకాశం ఓటీటీల ద్వారా సులభమైంది.
ఓటీటీ ప్లాట్ ఫాం అందుబాటులోకి వచ్చాక కొత్త సినిమాలు విడుదలైన రెండు మూడు వారాల్లోనే ఓటీటీల్లోకి విడుదలవుతూ సినిమా లవర్స్ ను వినోదాన్ని పంచుతున్నాయి. సినిమా విడుదల నాటి నుంచి థియేటర్లో చూసి ఎంజాయ్ చేసేవాళ్లు ఉంటారు, థియేటర్లో చూసే అవకాశం లేని వాళ్లు ఓటీటీలో రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటారు. నిత్యం ఏదో ఒక సినిమా ఏదో ఒక ఓటీటీ ప్లాట్ ఫాం ద్వారా స్ట్రీమింగ్ అవుతు ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నాయి. ఓటీటీల్లో వెబ్ సిరీస్ లు, సినిమాలు, టెలివిజన్ షోస్ విడుదలవుతూ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ క్రమంలో మరో కొత్త సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. మరి ఆ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది? ఎందులో అందబాటులో ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.
నటుడు విజయ్ ఆంటోని వైవిద్యభరితమైన కథలను ఎంచుకుంటూ విజయాలను అందుకుంటున్నాడు. బిచ్చగాడు సినిమాతో సంచలన విజయం అందుకున్న విజయ్ ఆంటోని ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ తరువాత పలు సినిమాలు వచ్చినప్పటికి ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇదిలా ఉంటే విజయ్ ఆంటోని నటించిన హత్య సినిమా జూలై 21న విడుదలైంది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ ఆంటోని, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించారు. సినిమాపై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికి మంచి కలెక్షన్లను వసూల్ చేసింది.
కాగా ఈ సినిమా ఓటీటీలోకి విడుదలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలుగుతో పాటు.. తమిళంలో కూడా ఈ నెల 20వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సినిమాలో ప్రధాన పాత్రదారి మోడల్ లైలా(మీనాక్షి చౌదరి)ని ఎవరో హత్య చేస్తారు. హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకవు. దీంతో ఆమె మర్డర్ కేసుని డిటెక్టివ్ వినాయక్(విజయ్ ఆంటోని)తోపాటు ఐపీఎస్ అధికారి సంధ్య కలిసి దర్యాప్తు చేస్తారు. అంతిమంగా వీరి దర్యాప్తులో ఏం తేలింది? ఈ హత్యని ఎలా పరిష్కరించారు? అనేది సినిమా మెయిన్ స్టోరీ.