బాలీవుడ్ పని అయిపోయింది, ఇక నిలదొక్కుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీని అలా అలా పైకి లేపారు. చాలా కాలం తర్వాత బాలీవుడ్ ఒక సాలిడ్ హిట్ ని అందుకుంది. దుమ్ములేపే కలెక్షన్లతో పఠాన్ సినిమా దూసుకుపోతుంది. కేజీఎఫ్, బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిన బాలీవుడ్ సినిమాగా నిలిచింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న విడుదలైన ఈ సినిమా తెలుగులో కూడా హిట్ గా నిలిచింది. షారుఖ్ ఖాన్ కి చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ పడిందేమో.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. షారుఖ్ ఖాన్ కి ఈ రేంజ్ హిట్ పడడానికి నాలుగేళ్లు పట్టింది. పఠాన్ కి ముందు.. జీరో సినిమాతో ఫ్లాప్ ని అందుకున్నారు. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న షారుఖ్ కి పఠాన్ సినిమాతో ఊహించని విజయాన్ని అందుకున్నారు.
ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇప్పటి వరకూ 663 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. విడుదలైన మొదటి రోజే 106 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా.. రెండో రోజు 113.50 కోట్లు కలెక్ట్ చేసింది. మూడవ రోజు 93.50 కోట్లు, నాల్గవ రోజున 116 కోట్లు, ఐదవ రోజున 112 కోట్లు, ఆరవ రోజున 48 కోట్లు, ఏడవ రోజున 41 కోట్లు, 8వ రోజున 33 కోట్లు.. టోటల్ గా 663 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా.. ఓటీటీ రైట్స్ విషయంలో కూడా రికార్డులు సెట్ చేసిందని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పఠాన్ సినిమాకి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ కంపెనీ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
పఠాన్ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో 100 కోట్లకు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 25న ఈ సినిమాని ప్రసారం చేయాలని అమెజాన్ ప్రైమ్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో షారుఖ్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. తమ హీరో సినిమా బాక్సాఫీస్ వద్దనే కాదు.. ఓటీటీలో కూడా రికార్డు ధరకు అమ్ముడుపోయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే పఠాన్ ఓటీటీలో ఆకట్టుకుంటుందా? థియేటర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమా ఓటీటీలో కూడా ఆ రేంజ్ లో హిట్ అవుతుందా? లేదా అనేది చూడాల్సి ఉంది. 100 కోట్లకు పఠాన్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసిందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.