నితిన్‌కు చాలాకాలంగా సరైన హిట్లేదు. ఈసారి మాచర్ల నియోజకవర్గంతో గట్టిగా కొడతాడని అంతా భావించారు. నితిన్ కూడా అదే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. కానీ, ఈ సినిమా కూడా నితిన్‌కు నిరాశే మిగిల్చింది. రొటీన్ స్టోరీ కావడంతో ప్రేక్షకుల నుంచి సరైన రెస్పాన్స్ అందుకోలేకపోయింది. తొలిరోజు మంచి ఓపెనింగ్స్ లభించినా కూడా సినిమా అలరించలేకపోయిందని తెలిసిపోయింది.
అయితే ఈ సినిమా అప్పుడే ఓటీటీ తలుపుతట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్టు 12నే థియేటర్లలో విడుదలైన మాచర్ల నియోజకవర్గం సినిమా అప్పుడే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా ఓటీటీ హక్కులను దక్కించుకుంది. మరికొన్ని వారాల్లోనే ఈ చిత్రం అమెజాన్ లో స్ట్రీమ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సెప్టెంబర్ 9న ఈ చిత్రం అమెజాన్‌లో స్ట్రీమ్ అవుతుందని గట్టిగా వినిపిస్తోంది. థియేటర్లలో అంత రెస్పాన్స్ లేకపోయినా కూడా.. తప్పకుండా ఓటీటీలో క్లిక్ అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే థియేటర్లలో క్లిక్ కాని సినిమాలో ఓటీటీలో ఆకట్టుకోవడం చూశాం. అందుకే ఇంత త్వరకా ఓటీటీ దారి పట్టినట్లు చెబుతున్నారు. అదే నిజమైతే ఇంకో మూడు వారాల్లో మాచర్ల నియోజకవర్గం సినిమా అమెజాన్ స్ట్రీమ్ అవుతుంది. మాచర్ల నియోజకవర్గం ఓటీటీ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.