ఇటీవలి కాలంలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకంటే ఓటిటిలలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలే ఎక్కువ ఉంటున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ నుండి ప్రేక్షకులంతా ఓటిటిలకే అలవాటు పడిపోయారు. అదీగాక థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు.. నెలా రెండు నెలలు తిరగకుండానే ఓటిటిలోకి వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ ఓటిటిలతో పాటు కొత్త ఓటిటిలు సైతం పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, ఆహా, డిస్నీ హాట్ స్టార్, జీ5, సోనీ లివ్, వూట్ లాంటి ఓటిటిలు థియేట్రికల్ రిలీజ్ అయిన లేదా డైరక్ట్ ఓటిటి రిలీజ్ కి రెడీగా ఉన్న సినిమా హక్కులను దక్కించుకునేందుకు.. ప్రతివారం పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఆగష్టు మూడో వారంలో ఓటిటి విడుదలకు 6 ఇండియన్ సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఈ వారం ఓటిటి/థియేట్రికల్ రిలీజ్ అవుతున్న సినిమాలేంటో చూద్దాం! ఆహా(Aha): హైవే - ఆగష్టు 19(తెలుగు) వూట్(Voot): బైరాగి - ఆగష్టు 19(కన్నడ) ఆహా(aha tamil): జీవి 2 - ఆగష్టు 19(తమిళం) జీ5(Zee5): ఏనుగు - ఆగష్టు 19(తెలుగు, తమిళం) డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Hotstar): హెవెన్ - ఆగష్టు 19(మలయాళం) నెట్ ఫ్లిక్స్(Netflix): షేర్ దిల్; ది ఫిలిబిత్ సాగా - ఆగష్టు 20(హిందీ) ఈ విధంగా ఈ వారం ఓటిటి ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాయి సినిమాలు. ఒకే వారంలో ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతుండటం అనేది మొదటిసారి కాదు. మరి పైన పేర్కొన్న 6 ఓటిటి సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. This Week OTT Releases pic.twitter.com/QV17q2rVdV — Aakashavaani (@TheAakashavaani) August 14, 2022