ఈ మధ్యకాలంలో కంటెంట్ పరంగా, హిట్స్ పరంగా అన్నివిధాలా సౌత్ బెస్ట్ అనిపించుకుంది. కానీ.. సౌత్ లో కూడా ఎక్కువగా కొత్త రకమైన కథలను, కథనాలను అందిస్తోంది మలయాళం ఇండస్ట్రీ. ఇప్పటిదాకా మలయాళం నుండి పాన్ ఇండియా మూవీస్ రాకపోయినా.. సబ్జెక్టు, స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. సాంగ్స్ ప్లేస్ మెంట్.. ఎమోషన్స్ ఇలా అన్నింట్లో మలయాళం మూవీస్ దూసుకుపోతున్నాయి. మీకోసం ఓటిటిలో రిలీజైన బెస్ట్, టాప్ 10 మలయాళం మూవీస్ ని సజెస్ట్ చేస్తున్నాం.
ఈ మధ్యకాలంలో ఇండియన్ బాక్సాఫీస్ ని దక్షిణాది సినిమాలు ఏలుతున్న సంగతి తెలిసిందే. కంటెంట్ పరంగా, హిట్స్ పరంగా అన్నివిధాలా సౌత్ బెస్ట్ అనిపించుకుంది. కానీ.. సౌత్ లో కూడా ఎక్కువగా కొత్త రకమైన కథలను, కథనాలను అందిస్తోంది మలయాళం ఇండస్ట్రీ. ఇప్పటిదాకా మలయాళం నుండి పాన్ ఇండియా మూవీస్ రాకపోయినా.. కంటెంట్ పరంగా, స్క్రిప్ట్ పరంగా ది బెస్ట్ మూవీస్ అందిస్తోందని ఆల్రెడీ లెజెండరీ సినీ దర్శకనిర్మాతలు కొనియాడారు. మలయాళం బెస్ట్ కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తోంది.. కాబట్టే, తెలుగుతో పాటు వేరే భాషల ఇండస్ట్రీలలో ఆ సినిమాలు ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి.
కంటెంట్ ఏదైనా మాట్లాడేది సినిమా భాషలోనే.. కనుక ఇక్కడ కంటెంట్ తో పాటు ప్రెజెంటేషన్ కూడా ఇంపార్టెంట్. సబ్జెక్టు, స్క్రీన్ ప్లే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. సాంగ్స్ ప్లేస్ మెంట్.. ఎమోషన్స్ ఇలా అన్నింట్లో మలయాళం మూవీస్ దూసుకుపోతున్నాయి. అంటే.. కేవలం మలయాళం అనే కాదు.. తెలుగులో కూడా ఈ మధ్య మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. కానీ.. మన సినిమాలు మలయాళం వారు రీమేక్ చేసుకునేంత గొప్ప కంటెంట్ అయితే ఇంకా రావట్లేదని చెప్పాలి. కాగా.. మలయాళం సినిమాలకు ఓటిటిలో ఫ్యాన్ బేస్ ఎక్కువ. మరి మీకోసం ఇటీవల ఓటిటిలో రిలీజైన బెస్ట్, టాప్ 10 మలయాళం మూవీస్ ని సజెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ చూసినా సరే.. అందరూ తప్పక చూడాల్సిన మలయాళం సినిమాలివి. వీటిలో ఒకటి రెండు తప్ప.. మిగతావన్నీ తెలుగులో అందుబాటులో ఉన్నాయి.