నేటి రాజకీయచరిత్ర రక్త చరిత్రగా తయారవుతోంది .రాష్ట్రంలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైసీపీ ఆగడాలు రోజురోజు పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ నేత దేవినేని ఉమపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దేవినేనిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. కర్రలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఆయన కారు కొంత దెబ్బతినగా… వెనుకే ఉన్న మరో టీడీపీ నేత కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఘటనాస్థలి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గడ్డమనుగూరు కొండపల్లి రిజర్వ్ పారెస్ట్‌లో అవకతవకలను ఆయన పరిశీలించేందుకు వెళ్లారు. జి.కొండూరు మండలంలో రెండు వైపుల నుంచి వైసీపీ కార్యకర్తల దాడికి దిగారు. ఘటనా స్థలంలో వైసీపీ కార్యకర్తలు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. దేవినేని ఉమను నిర్బంధంలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించారు. దేవినేనిపై జరిగిన దాడిని టీడీపీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మాజీమంత్రి దేవినేని ఉమపై మొత్తంగా 12 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తిరిగి పోలీసులు దేవినేనిపైనే 158, 147, 148, 341, 323, 324, 307, 427, 506, 353, 332, 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం గమనార్హం.
దేవినేని ఉమ అరెస్టులో హైడ్రామా చోటు చేసుకుంది. దేవినేని ఉమను పెదపారుపూడి పోలీస్ స్టేషన్ నుంచి నందివాడ పీఎస్‌కు తరలించారు. ఈ క్రమంలోనే నందివాడ గ్రామ సరిహద్దులు పోలీసుల నిర్బంధంలో ఉన్నాయి. స్థానికులను సైతం ఆధార్ కార్డు ఉంటేనే అనుమతిస్తున్నారు. మీడియాను కూడా పోలీస్ స్టేషన్ దగ్గరకు పోలీసులు అనుమతించలేదు. పీఎస్ పరిసర ప్రాంతాలకు ఎవరూ రాకుండా బారికేడ్లు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
నందివాడకు వస్తున్న టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దేవినేని ఉమను అర్ధరాత్రి బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేశారు. దేవినేని ఉమతో పాటు పట్టాభి, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అరెస్ట్ అయ్యారు. ఏ రాజకీయ నాయకులైనా ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలి ..దేశ సంక్షేమం కోసం అందరూ పాటు పడాలి ,ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టాలి .
ఒక వర్గం మరో వర్గంపై ఇలా విరుచుకు పడి ఒకరిపై ఒకరు రాళ్ళు విసురుకుంటూ ప్రజలలో చులకన కావటం చాలా దురదృష్జకరం. కార్యకర్తలు ఎవరైనా కావచ్చు అందరూ సామరస్యంగా ఉండి ఏవైనా సమస్యలుంటే శాంతంగా పరిష్కరించుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు .