దేశాన్ని రెండేళ్లు పట్టి పీడించిన కరోనా కొంతకాలం తగ్గుముఖం పట్టినా.. ఇప్పుడు మళ్లీ విజృంభిస్తుంది. దేశంలో మళ్లీ కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. ప్రస్తుతం వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీలో వచ్చే ఎన్నికలకు అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్దమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ముఖ్యమంత్రి జగన్ నేడు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దేవుడి దయవల్ల నరసాపురంలో ఒకేసారి రూ.3,300 కోట్ల అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఎంతో ఆనందంగా ఉందని.. త్వరలో నరసాపురం రూపు రేఖలు మారిపోతాయని అన్నారు. నరసాపురంలో ఆక్వా వర్సిటీకి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో చెప్పకపోయినా అనేక పనులు చేస్తున్నామని.. పేదల […]
ప్రస్తుతం దేశంలో ఉన్న ధరలు చూస్తే సామాన్యులకు మింగుడుపడని పరిస్థితి. మద్యతరగతి కుటుంబాల పరిస్థితి ఎలా ఉందంటే.. సంపాదన కొంత అయితే.. ఖర్చులు కొండంత అన్నట్టుగా ఉంది. కరోనా తర్వాత పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యాయి. ఈ క్రమంలో పేద ప్రజల కోసం ప్రధాని మోదీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు.. తెల్ల రేషన్ ఉన్నవారికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు. 2020 కరోనా కారణంగా లాక్ డౌన్ […]
ఏపీ సీఎం వైఎస్ జగన్ నెల్లూరు పర్యటించారు. ముత్తుకూరు మండలం నేలటూరులో ఏర్పాటు చేసిన ఏపీ జెన్‌కో ప్రాజెక్టు మూడో యూనిట్ బటన్ నొక్కి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా నేలటూరులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగిందన్నారు. ద్యుత్ ఉత్పత్తి అంశంలో నేడు మరో ముందడుగు పడిందని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన జెన్‌కో మూడో యూనిట్ 800 మెగావాట్ల ప్లాంటు జెన్ కో […]
ఈ మద్య రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఓ వైపు ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెస్తున్నా.. ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీ సాంఘీకశాఖ మంత్రి మేరుగు నాగార్జున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విజయవాడ.. వారధి నుంచి బందర్ రోడ్డు వైపు వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో మంత్రి కారులోనే ఉన్నారు. ఆయనకు స్వల్ప గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రైవేటు […]
ఏపీ రాజకీయాల్లో మాజీ మంత్రి కొడాలి నాని అంటే తెలియని వారు ఉండరు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులపై తనదైన మాటల తూటాలు పేలుస్తుంటారు. ఇక ఆయన ఆహార్యం విషయానికి వస్తే.. ఎప్పుడు గెడ్డం, మీసం.. మెడలో రుద్రాక్ష మాలలు, చేతికి ఉంగరాలతో కనిపిస్తుంటారు. అలాంటి కొడాలి నాని కొత్త అవతారం ఎత్తారు. వివరాల్లోకి వెళితే.. ఈ మద్య జరిగిన వైసీపీ ప్లీనరీలో హడలెత్తించిన కొడాలి నాని లుక్కే మారిపోయింది. మంగళవారం తిరుమలశ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తన […]
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేశారు. శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకూ పొంచి ఉన్న ప్రమాదం గురించి కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్ లో మాట్లాడారు. గోదావరి ఉదృతి, వరద సహాయక చర్యలపై సూచనలు చేశారు. గోదావరికి ముందస్తుగానే వరదలు వచ్చాయని..జూలై నెలలో రూ. 10 లక్షల క్యూసెక్కులకు పైబడి వరద వచ్చిందని అన్నారు. 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని, ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక నడుస్తోందని అన్నారు. రేపు […]
గత కొంత కాలంగా ఏపిలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. రెండో రోజు వైసీపీ ప్లీనరీ సమావేశంలో ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పూర్తిగా కొట్టుకుపోతుందని.. కనీసం డిపాజిట్లు కూడా రావని అన్నారు. ఏపిలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. చిప్ […]
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులు అర్పించి, వైయస్సార్ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సతీమని జయమ్మతో సహా ఏపీ సీఎం జగన్, వైయస్ షర్మిల ఒకే చోట కనిపించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన కూతురు షర్మిల తనయుడు రాజారెడ్డి స్పెషల్ గా కనిపించారు. […]
సాధారణంగా చాలా మంది పొలిటీషియన్స్, సినీ సెలబ్రెటీలు, క్రీడా రంగానికి చెందిన వారు ఖరీదైన బ్రాండెడ్ వస్తువులు వాడుతుంటారు. కొంతమందికి మార్కెట్ లో కొత్తగా ఏ బ్రాండ్ వచ్చిన మొదట తామే సొంతం చేసుకోవాలని చూస్తుంటారు. సెలబ్రెటీలు ధరించే ప్రతి కాస్ట్యూమ్, వాడే గాడ్జెట్స్ ఇంకా వాహనాలు అన్ని కూడా అంతర్జాతీయ స్థాయి బ్రాండ్స్ అయ్యి ఉంటాయి. ఇలాంటి వారిలో కొంత మంది రాజకీయ నేతలు కూడా వారు వాడే వస్తువులు చాలా గ్రాండ్ ఉంటాయి. తాజాగా […]