ఆంధ్రప్రదేశ్ లో కొంత కాలంగా టీడీపీ వర్సెస్ వైసీపీ మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. అధికార పార్టీపై ప్రతిపక్షాలు ఏ చిన్న చాన్సు దొరికినా విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ సైతం ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనను తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో విజయవాడలో దళిత గర్జన కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపేందుకు వెళ్తున్న మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి సహ పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడంతో టీడీపీ వర్గాలు భగ్గుమంటున్నాయి. విజయవాడలో […]
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీ వర్సెస్ టీడీపీకి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై ఒకరు మాటల యుద్దానికి దిగుతున్నారు. ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తే.. తమపై దాడులు చేస్తున్నారని.. అంతేకాదు అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ఏపీ పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేయడంపై సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి. దేవినేని తో పాటు అఖిల పక్ష నేతలను అరెస్ట్ చేసి మైలవరం పోలీస్ స్టేషన్ […]
తెలుగునాట వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి దేవినేని శ్రీమన్నారాయణ కన్నుమూశారు. ఈయన వయసు 88 సంవత్సరాలు. శ్రీమన్నారాయణ తాజాగా గుండెపోటుకి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అయితే.., వయసు ఎక్కువ కావడంతో ఆయన శరీరం వైద్యానికి […]
హనుమాన్ జంక్షన్- మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉమను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్‌లో జూమ్ యాప్ ద్వారా.. ఆయనను ఆన్ లైన్‌లో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. దేవినేని ఉమకు మైలవరం జడ్జి షేక్ షేరిన్ 14 రోజులు రిమాండ్ విధించారు. హనుమాన్ జంక్షన్ నుంచి దేవినేని ఉమను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మంగళవారం రాత్రి దేవినేని ఉమను […]
నేటి రాజకీయచరిత్ర రక్త చరిత్రగా తయారవుతోంది .రాష్ట్రంలో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైసీపీ ఆగడాలు రోజురోజు పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ నేత దేవినేని ఉమపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. దేవినేనిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. కర్రలతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఆయన కారు కొంత దెబ్బతినగా… వెనుకే ఉన్న మరో టీడీపీ నేత కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గడ్డమనుగూరు కొండపల్లి రిజర్వ్ పారెస్ట్‌లో అవకతవకలను ఆయన పరిశీలించేందుకు వెళ్లారు. జి.కొండూరు మండలంలో రెండు […]