స్పెషల్ డెస్క్- బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు రియాల్టీ షో ఎట్టకేలకు ముగిసింది. గత నాలుగు సీజన్స్‌కు భిన్నంగా ఈసారి సీజన్ 5, 19 మంది కంటెస్టెంట్స్‌తో మొదలైంది. కేవలం ఆట మాత్రమే కాకుండా ఎమోషనల్ జర్నీగానే ఈ బిగ్‌బాస్ హౌస్ ఉంటుంది. అందులో గేమ్స్ కూడా కండ బలంతోనే కాదు, బుద్ధి బలంతోనూ ఆడాలి. అలా బిగ్ బాస్ హౌజ్ లో తెలివిగా గేమ్ ఆడుతూ ఎవరైతే బయట ఉన్న ఆడియెన్స్ మనసు గెలుస్తారో వాళ్లే విజయం సాధిస్తారు.
ఇదిగో ఈ సారి అలాగే జరిగింది. బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు విజేతగా వీజే సన్నీ నిలిచాడు. ఇక యూట్యూబర్‌గా మంచి ఫాలోయింగ్ ఉన్న షణ్ముక్ రెండో స్థానంలో నిలిచి రన్నరప్ గా ఉండిపోయాడు. ఆదివారం రాత్రి జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో అక్కినేని నాగార్జున బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ ను ప్రకటించారు. ప్రేక్షకుల మనసులు గెలుచుకుని, బిగ్‌బాస్ కప్‌తో పాటు విజేతగా నిలిచిన వీజే సన్నీ ప్రైజ్ మనీతో పాటు ఇంకా చాలానే అందుకున్నాడు
బిగ్ బాస్ కప్ తో పాటు 50 లక్షల ప్రైజ్ మనీని అందించారు నిర్వాహకులు. దీంతో పాటు సువర్ణ భూమి ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ సంస్థ షాద్ నగర్ లోని తమ వెంచర్ లో 300 గజాల ఇంటి స్థలాన్ని కూడా ఇచ్చింది. దీని విలువు 25 లక్షల రూపాలు ఉంటుందని నాగార్జున చెప్పారు. అంతే కాదు ప్రముఖ బైక్స్ తయారీ సంస్థ టీవీఎస్ అపాచీ బైక్ ను బహుమతిగా అందించింది. వీటన్నింటితో పాటు రెగ్యులర్‌గా తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కూడా కలిపి బిగ్‌బాస్ నిర్వాహకులు ఇచ్చారు.
మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు విన్నర్ సన్నీ సుమారు కోటి రూపాయలు గెలిచాడని చెప్పవచ్చు. ఇక్కడ మరో ఇంట్రస్తింగ్ అంశం ఏటంటే.. బిగ్ బాస్ విజేత సన్నీకి ఇంటి స్థలం ఇచ్చిన సువర్ణ భూమి ఇన్‌ఫ్రా స్ట్రక్చర్ సంస్థ. రన్నర్ గా నిలిచిన షణ్ముక్ జశ్వంత్ కు కూడా ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించింది. అన్నట్లు బిగ్ బాస్ విజేత వీజీ సన్నీ హీరోగా సకల గుణాభిరామ అనే సినిమా చేస్తున్నాడు.