తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే కింగ్ నాగార్జున కు సంబంధించిన ఓ ప్రోమో రిలీజ్ చేశారే మేకర్స్. సాధారణంగా బిగ్ బాస్ ప్రోమో వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ గురించి రక రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి.
తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హూస్ట్ చేస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు వివిధ భాషల్లో వివిధ భాషల్లో వస్తుంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హూస్ట్ చేయగా, బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హూస్ట్ చేశారు. ఈ తర్వాత కింగ్ నాగార్జున బిగ్ బాస్ కి హూస్ట్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇప్పటి వరకు బిగ్ బాస్ రు సీజన్లు పూర్తి కాగా.. బిగ్ బాస్ 7 వ సీజన్ సిద్దంగా ఉంది. ఈ మద్యనే బిగ్ బాస్ సీజన్ 7 కి సంబంధించిన నాగార్జున ప్రోమో రిలీజ్ చేశారు. ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అంటూ హోస్ట్ నాగార్జున లైట్ గడ్డంతో స్టైలిష్ లుక్ లో డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 కి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెలితే..
బిగ్ బాస్ సీజన్ 6 పూర్తయి చాలా కాలం అయ్యింది.. దీంతో అసలు సీజన్ 7 ఉంటుందా? ఉండదా? అన్న అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానాలన్నింటికీ పులిస్టాప్ పెడుతూ నాగార్జున హోస్ట్‌గా బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వదలడంతో బుల్లితెరపై మళ్లీ సందడి మొదలైంది. ఇక ప్రోమోలో ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’అంటూ నాగార్జున కొట్టే డైలాగ్ చూస్తుంటే.. సీజన్ 6లో జరిగిన పొరపాట్లను మళ్లీ రిపీట్ చేయకుండా.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బిగ్ బాస్ ఆట ఆడించబోతున్నాం అనే విషయాన్ని చెప్పకనే చెప్పినట్లు అనిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 7 లో య్యూటబర్స్, కొరియోగ్రాఫర్స్, సీరియల్ నటీనటులను తీసుకోవడంతో పాటు ఓ ట్రాన్స్ జెండర్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాకపోతే.. బిగ్ బాస్ మేకర్స్ కంటెస్టెంట్స్ ఎవరన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఇక బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టంట్స్ పేరు రివీల్ చేసే లోపు కొంతమంది సెలబ్రెటీల పేర్లు ముందుగానే చెప్పేస్తున్నారు. ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా బేబీ మూవీ మానియా కొనసాగుతుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బేబీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. ప్రస్తుతం పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమా ఉందని టాక్ వినిపిస్తుంది. మౌత్ టాక్ తోనే ఈ చిత్రం బాక్సాఫీస్ హిట్ గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ మూవీలో హీరోయిన్ గా నటించిన వైష్ణవి చైతన్య పేరు కూడా బాగా పాపులర్ అవుతుంది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 కి వైష్ణవి ఎంట్రీ ఇవ్వబోతుందని ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న సెలబ్రెటీలను బిగ్ బాస్ లోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌజ్ లోకి వైష్ణవిని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.