త్వరలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలు జరగబోతున్నాయి. అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ సిద్ధమయ్యారు. ‘మా’ అధ్యక్ష పదవి కోసం మంచు మోహన్ బాబు కుమారుడు – హీరో విష్ణు ఆసక్తితో ఉన్నట్లు చెబుతున్నారు. రెండు మూడు నెలల్లో మా ఎన్నికలు జరుగనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ప్రకాష్ రాజ్ మూవీ అసోసియేషన్ ప్రతిష్ట మరింత పెంచుకోవడానికి గట్టి పోటీగా ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మంచు విష్ణు కూడా అదే గట్టిపోటీ తో రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తెలుగు పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని, వాటిని పరిష్కరించడానికి సరైన ప్రణాళిక కూడా తన దగ్గర ఉందని ప్రకాశ్ చెప్పారు. పలు టీవీ ఛానల్స్‌లో ఆయన ఇంటర్వ్యూ లు ఇస్తూ, తనకు ఈసారి ఎన్నికలలో మెగాస్టార్ చిరంజీవి బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెబుతూ వస్తున్నారు. మా’ అధ్యక్షుడు అయితే 100 శాతం ‘మా’కు సొంత భవనం నిర్మిస్తానని ఆయన మాటిచ్చారు.
సినీ కళాకారులకు సాయం చేయడానికి పరిశ్రమలో ఎంతోమంది సహృదయం కలిగిన నటులు ఉన్నారని, వాళ్లందరినీ ఒకతాటిపైకి తీసుకొస్తానని ప్రకాశ్ రాజ్ తెలిపారు. మంచు విష్ణు బరిలోకి దిగితే సమీకరణాలు వేగంగా మారిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ మద్దతు కోసం మంచు విష్ణు, మోహన్ బాబు కూడా పావులు కదుపుతున్నారు. మంచు విష్ణు స్పందన ఇంకా తెలియరాలేదు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాధారణ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికలలోను పోటీ ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరిది గెలుపు అనేది మనం వేచి చూడాల్సిందే.