ప్రకాష్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం ఏదో ఒక వివాదాన్ని రాజేస్తుంటారు. ఎప్పుడూ బీజేపీ ప్రభుత్వంపై నోరేసుకుని పడిపోయే ప్రకాష్ రాజ్.. తాజాగా చంద్రయాన్ 3 పై వెటకారపు వ్యాఖ్యలు చేశారు. అవే ఇప్పుడు ప్రకాష్ రాజ్ పై వ్యతిరేకత వచ్చేలా చేసింది. ప్రకాష్ రాజ్ తీరుపై నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.
యావత్ భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తం చంద్రయాన్-3 కోసం ఆసక్తిగా ఎదురుగా చూస్తుంది. ఇప్పటికే రష్యా యొక్క లూనా -25 మిషన్ ఫెయిల్ అవ్వడంతో ప్రపంచ దృష్టి ఇప్పుడు చంద్రయాన్-3పై ఉంది. ఒక పక్క దేశమంతా చంద్రయాన్-3 విషయంలో గర్విస్తుంటే ప్రకాష్ రాజ్ మాత్రం తన అక్కసుని వెళ్లగక్కారు. మామూలుగా ఈ దేశంలో ఉంటూ ఈ దేశం ఎదుగుదలను తట్టుకోలేని వారు చాలా మంది ఉన్నారన్న విమర్శలు, ఆరోపణలు నిత్యం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంటుంది. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ చేసిన పోస్ట్ తో ఆయనపై దేశద్రోహి అనే ముద్ర వేస్తున్నారు నెటిజన్స్. ఎక్స్ సోషల్ మీడియా వేదికగా చంద్రయాన్-3పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రకాష్ రాజ్. అదే ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతోంది.
ఒక వ్యక్తి టీ తరుపుతున్న చిత్రాన్ని షేర్ చేసి.. ‘బ్రేకింగ్ న్యూస్: విక్రమ్ ల్యాండర్ చేత చంద్రుడి నుంచి వచ్చిన మొట్టమొదటి పిక్చర్. అద్భుతం జస్ట్ యాస్కింగ్’ అని రాసుకొచ్చారు. అది కాస్తా వైరల్ అవ్వడంతో విమర్శలపాలయ్యారు. భారతదేశం యొక్క చారిత్రాత్మక మూన్ మిషన్ కి బాధ్యత వహిస్తున్న భారతీయ శాస్త్రవేత్తల మీద కొంచెమైనా గౌరవం చూపించండి అంటూ నెటిజన్స్ రిక్వస్ట్ చేస్తున్నారు. మరి కొందరు ఐతే.. రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలను పక్కనపెట్టి చంద్రయాన్-3 మిషన్ విషయంలో గర్వించాల్సిన సమయం. రాజకీయం, జాతి ట్రోలింగ్ కి మధ్య ఉన్న పరిధిని తెలుసుకోండి అంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేశారు.
ఒక మనిషిని ద్వేషించడానికి, దేశాన్ని ద్వేషించడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ స్థితిలో మిమ్మల్ని చూస్తున్నందుకు బాధగా ఉంది అంటూ మరొక నెటిజన్ రాసుకొచ్చారు. ఇది నిజంగా విషాదకరం, విచారకరం. ఇస్రో మరియు చంద్రయాన్-3 చేస్తున్న ఈ అరుదైన పని ఐక్యత యొక్క మెరుపులను వెలిగిస్తుంది. అలానే కోట్లాది మంది హృదయాల్లో అభిరుచిని, ఆశావాదాన్ని వెలిగిస్తుంది. మీరు దీన్ని సెలబ్రేట్ చేసుకోకపోతే దేశం మీద ఉన్న ప్రేమ కంటే ఒక వ్యక్తి పట్ల మీకున్న ద్వేషమే ఎక్కువ అంటూ రాసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ మీద ఎప్పుడూ విమర్శలు చేస్తుంటారు.
2019లో జనరల్ ఎలక్షన్స్ లో బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి బీజేపీపై, ప్రధాని మోదీపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. అంతేకాదు హిందుత్వంపై కూడా విషం చిమ్ముతారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఆగస్టు 15న తాను స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకోను అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఆ ట్వీట్ తీవ్ర దుమారం రేపింది. అది మరిచిపోక ముందే మరోసారి చంద్రయాన్-3ని వెక్కిరిస్తూ ట్వీట్ చేసి నెటిజన్స్ ఆగ్రహానికి గురయ్యారు. మరి ప్రకాష్ రాజ్ ట్వీట్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
ತಾಜಾ ಸುದ್ದಿ :~
ಚಂದ್ರಯಾನದಿಂದ ಈಗಷ್ಟೇ ಬಂದ ಮೊದಲ ದ್ರಶ್ಯ .. #VikramLander #justasking pic.twitter.com/EWHcQxc1jA
— Prakash Raj (@prakashraaj) August 20, 2023