Uttarakhand Groom Sued By Friends For Rs 50 Lakh After He Ditched Them And Left Baarat Early: ప్రస్తుతం వివాహ వేడుకలు వైరల్ న్యూస్‌కి వేదికగా మారుతున్నాయి. పెళ్లి మంటపాల్లో చోటు చేసుకునే సంఘటనలకు సంబంధించిన వీడియోలు ఎంత వైరలువుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుంత పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు తమకు ఉన్నంతలో వివాహ వేడుకను ఘనంగా నిర్వహించుకోవాలని భావిస్తున్నారు. అప్పు చేసి మరీ ఆర్భాటంగా చేసుకుంటున్నారు. ఇక పెళ్లికి హాజరయ్యే స్నేహితలుకు ప్రత్యేకంగా మందు పార్టీ ఇవ్వాల్సిందే. లేదంటూ ఊరుకోరు. ఇక మందు తాగి వారు బరాత్‌లో చేసే సందడి మాములుగా ఉండదు. అసలు స్నేహితులు లేకుండా బరాత్ వేడుకే ఉండదు. ఇక సాధారణంగా పెళ్లిలో వరుడు అలుగుతాడు.. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త మాత్రం ఇందుకు భిన్నం. ఇక్కడ పెళ్లి కొడుకుకు బదులు అతడి స్నేహితులు అలిగారు. మరి అంతటితో ఆగారా.. లేదు ఏకంగా వరుడిపై పరువు నష్టం దావా వేశారు. అది కూడా 50 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంతకు వారు ఎందుకు అలిగారో తెలిస్తే షాకవుతారు. ఆ వివరాలు..
ఉత్తరఖండ్‌లో వింత ఘటన జరిగింది. హరిద్వార్ లోని బహదూరాబాద్ లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. రవి అనే వ్యక్తికి పెళ్లి నిశ్చయమైంది. ఇక తనకున్నంతలో పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా చేసుకోవాలని భావించాడు. దానికి తగ్గట్లే ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇక పెళ్లి వేడుకలో జరగాల్సిన కార్యక్రమాలన్ని వైభవంగా జరిగాయి. ఇక బరాత్ వేడుక జరిగింది.
ఇది కూడా చదవండి: Coconut: వైరల్ వీడియో.. టెంకాయ ఎంత పని చేసింది.. కొంచెం ఉంటే ఆమె ప్రాణాలు పోయేవి..
అయితే, వరుడు స్నేహితులు రాకుండానే బరాత్ కు వెళ్లిపోయాడు. దీంతో అతని స్నేహితులు హర్ట్ అయ్యారు. చెప్పిన సమయాని కంటే ముందే వరుడు వెళ్లిపోయాడని, వరుడి స్నేహితులు అలిగారు. తమకు పెళ్లికి పిలిచి అవమానపర్చారని భావించారు. ఈక్రమంలో.. వరుడి స్నేహితుడు చంద్ర శేఖర్, వరుడు రవిపై యాభై లక్షల రూపాయలను పరువు నష్టం దావ వేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రస్తుతం ఈ వింత ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Bihar: పెళ్లికొడుకు చెంప పగలకొట్టిన మరదలు.. అసలు ఏం జరిగిందంటే!