Coconut: రోడ్డు మీద జరిగే ప్రమాదాలకు సాధారణంగా వాహనాలే ప్రధాన కారణం అవుతుంటాయి. రెండు, అంతకంటే ఎక్కువ వాహనాలు ఢీకొట్టుకోవటమో లేదా ఓ వాహనం రోడ్డుపై వెళుతున్న వ్యక్తిని.. వ్యక్తుల్ని ఢీకొట్టడం వల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎక్కువ సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతుంటాయి. కానీ, మనం ఇప్పుడు చెప్పుకోబోయే రోడ్డు ప్రమాదానికి కారణం.. చెట్టుపై ఉన్న ఓ టెంకాయ. టెంకాయకు, రోడ్డు ప్రమాదానికి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా?.. అయితే, ఈ వార్త చదివేయండి. మలేషియా, జలన్ తెలుక్‌కు చెందిన ఓ భార్యభర్తల జంట రోడ్డుపై బైకుపై వెళుతోంది. అది ఆదివారం కావటంతో రోడ్డుపై పెద్దగా ట్రాఫిక్ లేదు. బైకు రోడ్డుపై ఓ మోస్తరు స్పీడుతో వెళుతోంది. కొద్దిదూరం పోయిన తర్వాత ఈ జంటకు అనుకోని సంఘటన ఎదురైంది. ఓ చోట రోడ్డు పక్కఉన్న టెంకాయ చెట్టుమీద నుంచి ఓ టెంకాయ ఠక్కున కిందపడింది. ఆ పడ్డం కూడా నేరుగా భర్తతో బైకుపై వెళుతున్న మహిళ నెత్తిపై పడింది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. టెంకాయ దెబ్బకు బైకుపైనుంచి రోడ్డుపై పడిపోయింది. బైకు వెళుతున్న వేగానికి దొర్లుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోయింది. గాయాలతో అక్కడికక్కడే కుప్పకూలి నట్లు పడిపోయింది. ఇది గమనించిన ఆమె భర్త వెంటనే బైకును రోడ్డు పక్కగా ఆపి ఆమె దగ్గరకు వెళ్లాడు. ఆమెను ఎంతో కష్టం మీద అక్కడినుంచి పక్కకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఏంజరిగిందో తెలీదు. ఇక్కడ ఆ మహిళ దురదృష్టంలో అదృష్టం ఏంటంటే.. టెంకాయ నెత్తిన పడ్డప్పుడు ఆమె హెల్మెట్ ధరించింది. హెల్మెట్ గనుక లేకపోయి ఉంటే తల పగిలిపోయి చనిపోయి ఉండేది. అయితే, టెంకాయ పైనుంచి పడ్డ వేగానికి హెల్మెట్ సైతం తలనుంచి ఊడి కిందపడిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : వీడియో: లైవ్ లో యాక్సిడెంట్! తర్వాత ఆ వ్యక్తి చేసిన పనికి ఫ్యూజులు ఔట్!