మనిషికి.. కుక్కతో అవినాభావ సంబంధం ఉంది. రోజుకు ఓ ముద్ద పడేస్తే చాలు ఎంతో విశ్వాసంగా ఉంటుంది. వెనకటి కాలంలో ఇంటికి కాపాల కోసం కుక్కలను పెంచుకునే వారు. కానీ నేటి రోజుల్లో సరదా కోసం కుక్కలను పెంచుకునేవారు పెరిగిపోయారు. ఎంత ఒత్తిడి ఉన్నా.. కాసేపు ఇలా పెంపుడు జంతువులతో గడిపితే.. సెట్ అవుతుందని భావిస్తారు. ఇక వీటిని ఇంట్లో మనుషుల మాదిరే చూసుకుంటారు. వాటి కోసం ప్రత్యేకంగా ఆహారం, పడక ఏర్పాటు చేసేవారు కూడా ఉన్నారు. ఇక విదేశాల్లో అయితే పలువురు తమ ఆస్తిని పెంపుడు జంతువుల పేరిట రాసిన సంఘటనలు కూడా చూశాం. ఇక మన దేశంలో కొందరు పెంపుడు జంతువులకు ఘనంగా వివాహం, సీమంతం జరిపిన సంఘటనల గురించి విన్నాం. ప్రస్తుతం ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. పెంపుడు కుక్కలకు ఘనంగా వివాహం నిర్వహించారు. ఈ వేడుకకు భారీ ఎత్తున బంధుమిత్రులు తరలి వచ్చారు. సుమారు 500 మంది భారీ ఊరేగింపు నిర్వహించారు. ఆ వివరాలు..
ఉత్తర్‌ప్రదేశ్ హమీర్‌పుర్ జిల్లాలోని సుమెర్‌పుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వింత వివాహం చోటు చేసుకుంది. భరువా గ్రామానికి చెంది ఇద్దరు సాధువులు తమ పెంపుడు కుక్కలకు హిందూ సంప్రదాయాల ప్రకారం ఘనంగా పెళ్లి చేశారు. సౌంఖర్ అడవుల్లో మనసర్ బాబా శివాలయంలో ప్రధాన పూజారిగా పని చేసే స్వామి ద్వారకా దాస్ మహారాజ్ ఓ కుక్కను పెంచుకుంటున్నాడు. ఈ కుక్కకు పెళ్లి చేయాలని భావించిన ఆయన.. మరో సాధువు దగ్గర పెరుగుతున్న ఆడకుక్కతో వివాహం జరిపించారు.
ఇది కూడా చదవండి: పోలీసుల దుశ్చర్య! వ్యక్తి మలద్వారంలోకి కర్ర దూర్చి, ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి..
పరఛాచ్‌లోని బజరంగబలి ఆలయ పూజారి అర్జున్ దాస్ దగ్గర పెరుగుతున్న ఆడ కుక్కతో ద్వారకా దాస్ దగ్గర పెరుగుతున్న మగ కుక్క వివాహం జరిపించారు. జూన్ 5న ముహుర్తం ప్రకారం సంప్రదాయబద్ధంగా అంగరంగ వైభవంగా ఈ వివాహం జరిపారు. ఈ వేడకకు 500 మందితో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ వార్త తెలిసిన వాళ్లు.. మనుషుల కన్నా కుక్కల పనే బాగుంది.. ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది అంటారు కదా.. వీటికి ఈ రోజు వచ్చింది అని కామెంట్ చేస్తున్నారు. మరి కుక్కల వివాహంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Younger Sarpanch: కోడలిగా ఆ గ్రామానికి వచ్చింది..! ఆ ఊరికే దేవత అయ్యింది!