కేంద్ర ప్రభుత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా, భారత దేశ ప్రజలను ఏకం చేయడం, వారి సమస్యలను వినడమే లక్ష్యంగా కాంగ్రెస్ మాజీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. సెప్టెంబర్ 7 తమిళనాడులోని కన్యాకుమారిలో ఈ యాత్రను ప్రారంభించగా.. జమ్ము కాశ్మీర్ లో శ్రీనగర్ లో ముగిసింది. ఈ సందర్భంగా భారీ ముగింపు సభను ఏర్పాటు చేశారు. శ్రీనగర్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. 135 రోజులు పాటు ఆయన 4,084 కి.మీ మేర ఆయన పాదయాత్ర సాగింది.
కాగా, ఈ యాత్ర ముగింపు సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రియాంక, రాహుల్ గాంధీ చిన్న పిల్లలుగా మారి పోయి స్నో బాల్ గేమ్ ఆడుకున్నారు. శ్రీనగర్ లో మంచు వర్షం కురుస్తోంది. దీంతో అక్కడ మంచు గడ్డలు గడ్డలుగా పేరుపోయింది. తొలుత రాహుల్ రెండు పెద్ద మంచు ముక్కలు వెనక దాచి.. తన సోదరి ప్రియాంక గాంధీ తలపై విసిరారు. ఆ తర్వాత ప్రియాంకా సైతం.. తన సోదరుడిపై మంచు గడ్డలు విసిరారు. అంతేకాకుండా ఇతర పార్టీ నేతల సైతం ఆయన స్నో బాల్స్ ను విసిరారు. ఈ వీడియోను రాహుల్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయగా.. నవ్వులు పూయించడంతో పాటు వైరల్ అవుతోంది. ముగింపు సభలో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ పాల్గొన్నారు.
రాహుల్ మాట్లాడుతూ అనుకున్న దాని కన్నా ఈ యాత్ర విజయవంతమైందని, ఈ యాత్ర తనకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు. త్వరలోనే కాశ్మీర్ కు రాష్ట్ర హోదా కల్పిస్తామన్నారు. జోడో యాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ సభకు కాంగ్రెస్ 21 ఇతర పార్టీ నేతలను ఆహ్వానం పంపింది. తమిళనా డు ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ఎండీకే, బిహార్ మంత్రి తేజస్వీ యాదవ్ కు చెందిన ఆర్జేడీ, మహారాష్ట్రనేత శరద్ పవార్ కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీయూతో , సిపిఎం, సిపిఐ, కేరళ కాంగ్రెస్ తో పాటు పలు పార్టీల ముఖ్యనేతలు ఇవాళ శ్రీనగర్ సభలో పాల్గొంటారు. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, టిడిపిలు ఈ సమావేశానికి దూరంగా ఉన్నాయి. కాగా, చిన్న పిల్లల్లా మారి రాహుల్, ప్రియాంక స్నో బాల్స్ ఆడిన వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sheen Mubarak!😊
A beautiful last morning at the #BharatJodoYatra campsite, in Srinagar.❤️ ❄️ pic.twitter.com/rRKe0iWZJ9
— Rahul Gandhi (@RahulGandhi) January 30, 2023