ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు ప్రత్యర్థులపై చేసే వ్యాఖ్యలు కొన్నిసార్లు ఇరుకున పెడుతుంటాయి. గత ఎన్నికల సమయంలో రాహూల్ గాంధీ, ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.
సాధారణంగా ఎన్నికల సమయంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం నడుస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు ఇరు పక్ష నేతలు వ్యక్తిగత దూషణలకు కూడా తెగబడుతుంటారు. గత ఎన్నికల సమయంలో ఓ భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ.. ప్రధానిని ఉద్దేశించి.. ‘మోదీ’ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు కావడం.. రాహూల్ కి రెండేళ్లు శిక్షకూడా పడింది. తాజాగా రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టులో ఊరట లభించింది. వివరాల్లోకి వెళితే..
కర్ణాటకలోని కోలార్‌లో ఓ ఎన్నికల సభలో రాహూల్ గాంధీ మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసు పై పలుమార్లు విచారణ సాగుతూ వచ్చింది. మార్చి 23న రాహూల్ గాంధీని దోసిగా నిర్ధారిస్తూ.. రెండేళ్లు జైలు శిక్ష విధించింది. పరువునష్టం కేసులో తనను వ్యక్తిగతంగా హాజరుకావాలని రాంచీ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఆదేశించడంతో, కాంగ్రెస్ అగ్రనేత రాహూల్ గాంధీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పరువు నష్టం కేసులో దాఖలైన పిటిషన్ హైకోర్టు విచారణ జరిపింది. రాహుల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఆగస్టు 16న విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.
2019లో ఎన్నికల సమయంలో రాహూల్ గాందీ కర్ణాటకలో ప్రచారంలో పాల్గొన్న సమయంలో ఓ భారీ బహిరంగ సభలో దేశంలోని దొంగలందరూ మోదీ అనే ఇంటిపేరును ఎందుకు పెట్టుకుంటారంటూ? వ్యంగంగా ప్రశ్నించారు. దీంతో ఆయనపై పలు రాష్ట్రాల్లో పరువు నష్టం కేసులు నమోదయ్యాయి. ఈ కేసుపై విచారణ సాగుతూ వచ్చింది. ఈ ఏడాది మార్చి 23న రాహుల్‌ను దోషిగా నిర్ధారిస్తూ రెండేళ్ల జైలు శిక్షను విధించింది. అంతేకాదు వాయనాడ్ ఎంపీగా ఉన్న రాహుల్‌పై అనర్హత వేటు పడింది.