'నాటు.. నాటు..' పాటకు ఆస్కార్ రావడంలో రాహుల్ సిప్లిగంజ్ భాగమైన సంగతి అందరికీ విదితమే. రాహుల్.. కాల భైరవతో ఈ పాటను ఆలపించారు. ఈ సందర్బంగా అతనిని ఘనంగా సన్మానించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భారీ నజరానా కూడా ప్రకటించింది.
ప్రముఖ నటి, బిగ్ బాస్ కంటిస్టెంట్ ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ పీఏ బెదిరింపులకు పాల్పడ్డాడని అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అభిమాన నేతలు, హీరోలు, క్రికెటర్లు కనబడగానే ఫోటోలు దిగాలని, వారి నుండి ఆటోగ్రాఫ్ తీసుకోవాలని, వారితో కరచాలనం చేయాలని ఆశపడుతూ ఉంటారు. ఇక వారు తమ ఊరు వస్తున్నారంటే చాలు హడావుడి చేస్తుంటారు అభిమానులు. తమ అభిమానాన్ని పలు రకాలుగా చూపిస్తారు. వారికి ఘన స్వాగతం పలికడం దగ్గర నుండి తిరిగి వెళ్లే వరకు అన్ని మర్యాదలు చేస్తారు. అటువంటి అరుదైన ఘన స్వాగతాన్ని పొందారు ప్రియాంక గాంధీ
కేంద్ర ప్రభుత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా, భారత దేశ ప్రజలను ఏకం చేయడం, వారి సమస్యలను వినడమే లక్ష్యంగా కాంగ్రెస్ మాజీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. సెప్టెంబర్ 7 తమిళనాడులోని కన్యాకుమారిలో ఈ యాత్రను ప్రారంభించగా.. జమ్ము కాశ్మీర్ లో శ్రీనగర్ లో ముగిసింది. ఈ సందర్భంగా భారీ ముగింపు సభను ఏర్పాటు చేశారు. శ్రీనగర్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. 135 రోజులు పాటు […]
కర్ణాటకలో హిజాబ్ వస్త్ర ధారణ వివాదం తీవ్ర రూపం దాల్చింది. హిజాబ్, కాషాయ వస్త్రధారణలతో విద్యార్థులు కళాశాలలకు రావడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొన్ని కళాశాలల విద్యార్థుల మద్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. పోటాపోటీగా నినాదాలు చేశారు. కొన్నిచోట్ల రాళ్లు రువ్వుకున్నారు. దీంతో పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పలుచోట్ల పోలీసులు లాఠీఛార్జి చేసి, బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మూడు రోజుల పాటు డిగ్రీ, పీయూ కళాశాలలకు […]
ప్రస్తుత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఇటీవల గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. స్థానిక మొర్పిర్ల ప్రాంతంలో ప్రియాంక గాంధీ.. గిరిజన మహిళలతో కలిసి జానపద నృత్యం చేశారు. అంతేగాక అక్కడి గిరిజన సంప్రదాయం ప్రకారం.. గిరిజన మహిళలలాగే ఎర్రటి చీరను ధరించి.. తలపై కుండ పెట్టుకుని ధోల్ దరువులకు అనుగుణంగా ప్రియాంక డ్యాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింత తెగ వైరల్ అవుతుంది. మీరు ఈ వీడియో పై లుక్కేసి […]
పొలిటికల్ డెస్క్- మన దేశంలో ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తాయి. ఒకరిని మించి మరొకరు పోటీ పడీ మరి వరాలు ఇస్తారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ అంసెబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపధ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లును ఆకర్షించేందుకు భారీ స్థాయిలో హామీలు ఇస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏంచేస్తామో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. వచ్చే యేడాది జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల నేపధ్యంలో ఈ సారి కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు […]
హింసాత్మక ఘటనల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయిన లఖింపూర్ ఖేరిలో పర్యటించేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారంనాడు అనుమతి ఇచ్చింది. లఖింపూర్ ఖేరిలో జరిగిన హింసాత్మక సంఘటన స్థలానికి వెళుతున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ, ఎస్పీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, తదితరులను నిర్భందించిన విషయం తెలిసిందే. లఖింపూర్ ఖేరీలోకి ఎవరూ కూడా అడుగుపెట్టకుండా యోగీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ సారథ్యంలోని ఐదుగురు ప్రతినిధుల […]
కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీని పోలీసులు ఒక గదిలో నిర్బంధించారు. ఆమె ఆ గదిని చీపురుతో శుభ్రం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనల్లో ఆదివారం అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఈ హింసాకాండలో 8 రైతులు మరణించారు. వారి కుటుంబాలను పరామర్శించేందుకు ప్రియాంకగాంధీ ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాకు వెళ్తుండగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. రైతులు మరణిస్తే వారి కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు […]