నిత్యం రాజకీయాలతో బిజీ బిజీగా ఉంటూ.. బీజేపీపై విమర్శలు కురిపిస్తూ ఉండే రాహుల్ గాంధీ.. తాజాగా ఓ వెడ్డింగ్ రిసెప్షన్‌లో సందడి చేశారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు..
ఈరోజుల్లో చిరు ఉద్యోగాలు చేసుకునే వారికే సొంత ఇళ్ళు ఉంటున్నాయి. ఇక రాజకీయ నేతల గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వరకూ ప్రతి ఒక్కరికీ సొంత ఇళ్ళు ఉంటాయి. అయితే జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇప్పటి వరకూ ఒక సొంత ఇల్లు లేదని చెబుతున్నారు.
రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ అంటే రాజకీయాలు, మోదీ, బీజేపీ వంటి వాటితో పాటు ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మరీ ముఖ్యంగా పెళ్లి ప్రస్తావన తప్పకుండా వస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కూడా ఇదే ప్రశ్న ఎదురయ్యింది రాహుల్‌కి. మరి ఆయన సమాధానం ఏంటంటే..
కేంద్ర ప్రభుత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా, భారత దేశ ప్రజలను ఏకం చేయడం, వారి సమస్యలను వినడమే లక్ష్యంగా కాంగ్రెస్ మాజీ అధినేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. సెప్టెంబర్ 7 తమిళనాడులోని కన్యాకుమారిలో ఈ యాత్రను ప్రారంభించగా.. జమ్ము కాశ్మీర్ లో శ్రీనగర్ లో ముగిసింది. ఈ సందర్భంగా భారీ ముగింపు సభను ఏర్పాటు చేశారు. శ్రీనగర్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. 135 రోజులు పాటు […]
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం చోటుచేసుకుంది. భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి గుండెపోటుతో మరణించారు. రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్ర ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు యాత్రలో పాల్గొన్నారు. సంతోక్ సింగ్ చౌదరి కూడా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. పంజాబ్ లోని ఫిలోవర్ […]
దేశ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ను నిర్వహిస్తున్నారు. పాదయాత్ర చేస్తూ అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీని మరింత బలంగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటర్ల నాడిని, వారి సమస్యలను తెలుసుకునేందుకు ఆయన ఈ యాత్రను ఉపయోగించుకుంటున్నారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాలను తెలుసుకుంటూ, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గెలుపునకు కావాల్సిన ప్రణాళికలను ఇప్పటినుంచే రూపొందించుకుంటున్నారు. ఇదిలాఉంటే.. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై ఎప్పుడూ విమర్శలకు […]
రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దేశాన్ని మొత్తాన్ని ఒక తాటిపైకి తీసుకు రావాలనే లక్ష్యంతో ఈ పాదయాత్రను చేస్తున్నారు. ఈ యాత్ర ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ చేరుకుంది. అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. రాహుల్ అతని చెల్లి ప్రియాంక వాద్రా మధ్య ఉన్న అనుబంధం గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అన్న రాహుల్ గాంధీ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని ప్రియాంక వాద్రా గతంలోనే […]
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత పలు అనారోగ్య సమస్యలతో సోనియా గాంధీ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆవిడ కొవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు. కరోనా సోకడానికి ముందు నుంచే సోనియా శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అయితే సాధారణ హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లినట్లు పార్టీలోని కొందరు చెబుతున్నారు. […]
దేశంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ జాబితాలో ప్రథమ స్థానంలో ఉంటాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ. కొన్నాళ్ల క్రితం వరకు రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితం, పెళ్లి తదితర వాటి గురించి మీడియాలో వార్తలు వచ్చేవి. ఇప్పుడైతే ఆ టాపిక్‌ను పక్కకు పెట్టారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా.. గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో.. దేశమంతా పాదయాత్ర చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఓ […]
ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రజలను పలకరించుకుంటూ వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. మహారాష్ట్ర అకోలాలో గురువారం మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. స్వాతంత్య్ర పోరాటయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, అలానే స్థానికుల మనోభావాలు దెబ్బతీశారని రాహుల్ గాంధీపై బాలాసాహెబంచి శివసేన నాయకురాలు వందన సుహాస్ డోంగ్రే గురువారం థానే నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు […]