కేరళలో కొత్త కరోనా కేసులు…
పాజిటివిటీ రేటు 13.61%…
తమిళనాడులో ఆగస్టు 9 వరకు కరోనా లాక్‌డౌన్…
నిన్నమొన్నటి వరకు నెమ్మదించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా కేరళ, తమిళనాడులో కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా, కేరళలో భారీగా కేసులు నమోదువుతున్న విషయం తెలిసిందే. కేరళ తర్వాత కర్ణాటక, తమిళనాడులో కూడా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరో వారం పొడిగించారు.
కేరళలో నిన్న వరుసగా నాలుగో రోజు కూడా 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజులో 20,772 కేసులు నమోదు కాగా, 116 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 13.61 శాతంగా ఉంది. మరోవైపు, తమిళనాడులోనూ కేసులు స్వల్పంగా పెరగడంతో అప్రమత్తమైన ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఆగస్టు 8వ తేదీ వరకు పొడిగించింది. థర్డ్‌వేవ్ ముప్పు పొంచి ఉండడంతో ప్రజలెవరూ అనవసరంగా బయట తిరగొద్దని హెచ్చరించింది. అనుమతించిన దానికంటే ఎక్కువమంది గుమికూడిన దుకాణాలపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు అందాయి.
రాష్ట్రంలో నిన్న 24 గంటల వ్యవధిలో 1859 కేసులు నమోదు కాగా, 28 మంది మరణించారు. 21,207 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.23 కోట్ల కరోనా డోసులను పంపిణీ చేశారు. 40 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తయినట్టు అధికారులు తెలిపారు. కేరళలో కరోనా కేసుల విజృంభణ చూస్తుంటే థర్డ్ వేవ్ ప్రారంభమైనట్లుగా కనబడుతోందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే అన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో 36,491 యాక్టివ్ కేసులున్నాయి