దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు కాస్త ఊపరిపీల్చుకుంటున్నారు. దీంతో కరోనా సెకండ్ వేవ్ బలంగా పుంజుకోవడంతో ఎంతో మంది మరణించారు. ఈ నేపథ్యంలో దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను విధించాయి. కేసుల సంఖ్య దాదాపుగా తగ్గుముఖం పట్టడంతో పూర్తిగా లాక్‌డౌన్‌ను ఎత్తేశాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక అన్ని రాష్ట్రాలు ఒకలా ఉంటే కేరళ రాష్ట్రంలో మాత్రం పరిస్థితులు అందుగా భిన్నంగా కనిపిస్తున్నాయి.
ఈ రాష్ట్రంలో కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇక ఏం చేయేలేని రాష్ట్ర్ర ప్రభుత్వం దీంతో మరోసారి లాక్‌డౌన్‌ను విధించింది. ఇక ఇప్పటికే వారంతపు లాక్‌డౌన్‌ను విధించింది అక్కడి సర్కార్. అయినా మార్పు రాకపోవడంతో సంపూర్ణ లాక్‌డౌన్ దిశగా కేరళ సర్కార్ అడుగులు వేసింది. ఈ నెల 31 నుంచి ఆగస్టు 1 వరకు కేరళలో లాక్‌డౌన్‌ను విధించారు.
ఇక రాష్ట్రంలోని మలప్పురం, త్రిస్సూరు, కోజికోడ్, ఎర్నాకుళం, పాలక్కడ్, కొల్లాం, అలప్పుళ, కన్నూరు. తిరువనంతపురం, కొట్టాయం వంటి జిల్లాల్లో కేసులు భారీగా బయటపడుతున్నాయి. మనదేశంలో కేరళ నుంచే కేసుల సంఖ్య విపరీతంగా నమోదవుతున్నాయి. ఇక మొత్తం కేసుల్లో కేరళలో 50శాతానికి పైగా నమోదవుతుండటంతో భయందోళనలకు గురి చేస్తున్నాయి. బుధవారం ఒక్కరోజే 22,056 మందికి కరోనా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. మరే రాష్ట్రంలోనూ ఈ విధంగా కేసులు నమోదవకపోవటం విశేషం.