వరుసగా జరుగుతున్న రైళ్ల ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఎంతటి విషాదాన్ని నింపిందో అందరికీ తెలుసు. ఈ ఘటనలో మూడు రైళ్లు ఢీకొనగా.. సుమారు 300 మంది చనిపోయిన సంగతి విదితమే.
వరుసగా జరుగుతున్న రైళ్ల ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఎంతటి విషాదాన్ని నింపిందో అందరికీ తెలుసు. ఈ ఘటనలో మూడు రైళ్లు ఢీకొనగా.. సుమారు 300 మంది చనిపోయిన సంగతి విదితమే. 1,200 మందికి పైగా గాయపడ్డారు. ఈ దశాబ్దకాలంలో అతిపెద్ద రైలు ప్రమాదంగా ఈ ఘటన నిలిచింది. రెండు రోజుల క్రితం వందేభారత్ రైలులో మంటలు చెలరేగి.. ప్రయాణీకులు పరుగులు పెట్టిన దృశ్యాలు చూశాం. నిన్నటికి నిన్న ఒడిశాలో మరో రైలు ప్రమాదం తప్పింది. సిగ్నలింగ్ లోపం వల్ల మరమ్మత్తులు చేస్తున్న లూప్ లైన్ లోకి రైలు ప్రవేశించగా.. లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల తృటిలో పెను ప్రమాదం తప్పింది.
తాజాగా తిరుపతి రైల్వే స్టేషన్ లో రైలు పట్టాలు తప్పింది. కేరళలోని తిరువనంతపురానికి వెళుతున్న తిరుపతి-తిరువనంతపురం రైలు చివరి బోగి పట్టాలు తప్పింది. ఐదో ఫ్లాట్ ఫార్మ్ ట్రాక్ చేంజింగ్ పాయింట్ వద్ద సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది. ఓ బోగి పట్టాలు తప్పి కొంత దూరం వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో పక్క ట్రాక్ లో ఉన్న సిమెంట్ దిమ్మలు దెబ్బతిన్నాయి. ఆ బోగి పక్కకు ఒరిగిపోయింది. వెంటనే గుర్తించిన అధికారులు .. బోగిని పట్టాలపైకి ఎక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించినట్లు తెలుస్తుంది. ఒడిశా ఘటనపై ప్రజలు భయాందోళనలు చెందుతున్న తరుణంలోనే ఇటువంటి రైలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఈ బోగీలో ప్రయాణీకులు లేనట్లు తెలుస్తోంది.