ఐఐటీ, ఐఐఐటీ లాంటి ఉన్నత విద్యాసంస్థల్లో చదవాలని ప్రతి విద్యార్థి కళలు కంటాడు. అందుకు ప్రధాన కారణం. వీటిలో చదివితే.. నాలెడ్జ్ గెయిన్ అవ్వడమే కాకుండా.. టాప్ కంపెనీల్లో ఉద్యోగం తెచ్చుకోవచ్ఛన్న ఆశ. అందుకు తగ్గట్లుగానే.. కంపెనీలు కూడా ఈ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులను ఆయా కంపెనీల్లోకి తీసుకోవడానికి పోటీపడుతున్నాయి. తాజాగా లక్నోలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ (ఐఐఐటీ)కు చెందిన అభిజీత్ ద్వివేది అనే విద్యార్థి అమెజాన్ సంస్థలో అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీను పొంది రికార్డు సృష్టించాడు. అమెజాన్ అతడికి సుమారు రూ. 1.2 కోట్లను ప్యాకేజ్‌ను అందించిన్నట్లు తెలుస్తోంది.
ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో అమెజాన్‌కు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజనీర్‌గా అభిజీత్ ద్వివేది నియమితులయ్యారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీ.టెక్ చివరి సంవత్సరం చదువుతున్న అభిజీత్.. తన ప్రతిభతో వార్షిక ప్యాకేజీతో మునుపటి ప్లేస్‌మెంట్ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టాడు. కోవిడ్-19 ఉదృతి కాస్త తగ్గడంతో ఐఐఐటీ లక్నో విద్యార్ధులు అత్యధిక ప్యాకేజ్‌లతో 100 శాతం ప్లేస్‌మెంట్ సాధించారు. ఈ ఏడాది ప్లేస్‌మెంట్స్‌లో ఐఐఐటీ లక్నో రికార్డులను క్రియేట్ చేసింది.
ప్లేస్‌మెంట్ కోరుకునే ఇతర విద్యార్థుల కోసం అభిజీత్ కొన్ని చిట్కాలను కూడా పంచుకున్నాడు. “ఒక మంచి ఉద్యోగం సంపాదించాలంటే కొన్ని విషయాలు తప్పక తెలుసుండాలి. సాఫ్ట్ స్కిల్స్(కమ్యూనికేషన్ స్కిల్స్, బాడీ లాంగ్వేజ్) చాలా ముఖ్యం, కాబట్టి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు తమకు సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే అవసరమని భావించకూడదు. ఉద్యోగ అవకాశాల గురించి తెలుసుకోవడానికి సీనియర్‌లతో సన్నిహితంగా ఉండటం, ఇంటర్వ్యూలల్లో సక్సెస్ అవ్వడానికి వారి నుండి అవసరమైన సలహాలు తీసుకోవడం మంచిదని చెప్పుకొచ్చాడు. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం క్రమం తప్పకుండా.. ఎంప్లాయిమెంట్ పోర్టల్‌లలో ప్రొఫైల్‌లను అప్డేట్ చేస్తూ ఉండాలని సూచించారు.
Abhijeet Dwivedi has been hired as a software development engineer for Amazon in Dublin, Ireland. “I saw several videos to prepare myself for the interview. Soft skills matter a lot,” Dwivedi said.#SankushMedia #Amazon #Amazonjob #iitlucknow pic.twitter.com/Kbv8T8KEdY
— Sankushmedia (@sankushmedia) April 9, 2022