టాటా ఆ పేరు అంటేనే నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం. దేశంలో టాటాలు ప్రవేశించని రంగం లేందంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు, వ్యాపారాలున్నప్పటికి వారి పేరు ఎప్పుడు ప్రపంచ ధనవంతుల జాబితాలో ఉండదు. ఎందుకంటే వారి సంపాదనలో అధిక మొత్తాన్ని సమాజానికే కేటాయిస్తారు. దేశంలో ఏదైనా ఆపద వాటిల్లిందంటే ఆపన్నహస్తం అందించడంలో టాటాల తర్వాతే ఎవరైనా. వేల కోట్ల ఆస్తి ఉన్నప్పటికి.. అత్యంత నిరాడంబరంగా ఉంటారు రతన్ టాటా. ఇప్పటికి ఆయన తన కారును తానే స్వయంగా డ్రైవ్ చేస్తారు. సింప్లిసిటీకి నిలువెత్తు నిదర్శంగా ఉండే రతన్ టాటా డిసెంబర్ 30న 84 వసంతంలోకి అడుగుపెట్టారు.
సామాన్యుల ఇళ్లలో బర్త్ డే వేడుకలు అంటేనే.. చాలా హంగామా ఉంటుంది. మరి రతన్ టాటా బర్త్ డే అంటే ఇంక ఎంత హంగామా, హాడావుడి ఉండాలి కదా. ఇవన్ని ఉంటే ఆయన టాటా వారసుడు ఎలా అవుతారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతున్న రతన్ టాటా బర్త్ డే సెలబ్రెషన్స్ ఫోటోలు చూసిన వారు ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. మరి ఇంత సింపుల్ గానా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇది చదవండి : శనక్కాయలు ఫ్రీగా ఇచ్చిన వ్యక్తికి.. 12 ఏళ్ళ తరువాత NRI సహాయం!
బర్త్ డే సందర్భంగా చిన్న కప్ కేక్, రెండు క్యాండిల్స్ మాత్రమే. ఇక అతిథులుగా హాజరైంది కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే. రతన్ అసిస్టెంట్ శాంతను నాయుడు మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొనడం గమనార్హం. శాంతను బర్త్‌డే విషెస్ చెబుతుంటే.. కప్ కేక్‌పై ఉన్న క్యాండిల్‌ను ఊది అనంతరం కేక్‌ను కట్ చేశారు రతన్ టాటా. ఇందుకు సంబంధించని వీడియోని మొదట వైభవ్ భోయర్ అనే వ్యక్తి లింక్డ్‌ఇన్ లో పోస్ట్ చేయగా.. ఆ తర్వాత హర్ష గోయాంక దీన్ని రీ ట్వీట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఈ వీడియో చేసిన నెటిజనులు రతన్ టాటా నిరాడంబరతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రతన్ టాటా సింప్లిసిటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
A charming scene with the unassuming #RatanTata on his 84th birthday pic.twitter.com/wkmm7jhCyZ
— Harsh Goenka (@hvgoenka) December 29, 2021