నటి కస్తూరి అమ్మాయిలు వ్యక్తిగత వీడియో ఒకటి ట్విట్టర్ లో షేర్ చేసి నెటిజన్స్ ఆగ్రహానికి గురయ్యింది. వారి వ్యక్తిగత విషయాలు మీకెందుకు అంటూ మండిపడుతున్నారు. ఇంతకే కస్తూరి షేర్ చేసిన వీడియో ఏంటి? ఆ వీడియోలో ఏముంది అంటే?
కస్తూరి శంకర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగారు. నాగార్జున, బాలకృష్ణ, జగపతిబాబు వంటి హీరోలతో నటించారు. ఆ తర్వాత సీనియర్ నటిగా బిజీ అయిపోయారు. ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్, టీవీ షోస్ లో చేస్తున్నారు. వీలు దొరికినప్పుడల్లా ఎవరైనా దొరికితే సోషల్ మీడియాలో ట్వీటేస్తుంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈమె ఏదో ఒక వివాదాస్పద కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా ఆమె తన ట్విట్టర్ ఖాతాలో అమ్మాయిల వ్యక్తిగత విషయానికి సంబంధించిన వీడియో షేర్ చేసింది. ఆ వీడియో షేర్ చేయడంపై నెటిజన్స్ మండిపడుతున్నారు. ఈ విషయంపై సింగర్ చిన్మయి కూడా స్పందించారు. ఇలా చేయడం అవసరమా అన్నట్టు కామెంట్స్ చేశారు. అసలేం జరిగిందంటే?
ఇద్దరు అమ్మాయిలు మద్యం షాపులో ఆల్కహాల్ కొంటున్న వీడియోని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ‘తాగండి అమ్మాయిలు తాగండి.. ఎనిమిది మందిలో ఈమె ఒక్కర్తే మగరాయుడు. ఏ మాత్రం అసహ్యం కాదు. వాట్సాప్ ఫార్వర్డ్ ఆఫ్ ద డే. సూపర్. మహిళల హక్కులు ఆలోచించకుండానే తిరిగి వస్తున్నాయి’ అంటూ ట్వీట్ చేశారు. ఇది మిస్ ఫైర్ అవ్వడంతో నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిలు తాగడాన్ని సమర్ధిస్తున్నావా? లేక వ్యతిరేకిస్తున్నావా?.. వారి ఇష్టం, వారి డబ్బులు, వారి లివర్.. నీకేంటి నొప్పి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరొకరు ఐతే.. నీ ట్వీట్ తో దిగ్భ్రాంతి చెందాను. అమ్మాయిలు మందు తాగకూడదని లేదా కొనకూడదని చెబుతున్నారా? ఎందుకు ఈ అమ్మాయిల పరువు తీస్తున్నారు. తక్కువ సామాజిక ఆర్థిక నేపథ్యం నుంచి వచ్చిన వారిలా కనబడుతున్నందుకా వారి వీడియో షేర్ చేశారు. నీ స్థాయి మహిళలు ఇలా చేస్తే ధైర్యంగా చెబుతావా అంటూ విమర్శిస్తున్నారు.
దీనిపై సింగర్ చిన్మయి శ్రీపాద కూడా స్పందించారు. నిజాయితీగా చెప్తున్నా.. కస్తూరి నువ్వు ఇలా షేర్ చేయాల్సిన అవసరం లేదు అంటూ ట్వీట్ చేశారు. దీంతో సింగర్ చిన్మయికి మద్దతుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ‘అమ్మాయిల వైపు నిలబడినందుకు అభినందిస్తున్నాను. ప్రజలు తమ డబ్బును తమకు నచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. కేవలం అన్నం, గోధుమలు, వెజ్, నాన్ వెజ్ మాత్రమే తినాలని అనుకోకూడదు. చదువు కోసమే డబ్బు ఖర్చు పెట్టాలని అనుకోకూడదు. వారికంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి’ అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఏదేమైనా గానీ ఈ వీడియో షేర్ చేయడంతో కస్తూరి తమిళుల ఆగ్రహానికి గురయ్యారు. మరి కొంతమంది మాత్రం కస్తూరికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి కస్తూరి షేర్ చేసిన ఈ వీడియోపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
தண்ணியடி, பெண்ணே தண்ணியடி !
எட்டு மறிவினில் ஆணுக்கிங்கே பெண்
இளைப்பில்லை காணென்று தண்ணியடி.WhatsApp fwd of the day. As received.
Super. அப்ப பெண்கள் உரிமை தொகை சிந்தாம சிதறாம திரும்பிடும் 🫤#dravidamodel pic.twitter.com/7SA889fwpp— Kasturi (@KasthuriShankar) July 13, 2023