చాలా మంది తమ పుట్టినరోజు వేడుకలను ఫ్రెండ్స్ ని, చుట్టాలను, చుట్టుపక్కల వాళ్ళని పిలిచి ఘనంగా చేసుకోవాలనుకుంటారు. కొంతమంది మాత్రం అనాథ పిల్లలతో, పేదవాళ్లతో జరుపుకోవాలనుకుంటారు. అలాంటి జాబితాలో సితార ఘట్టమనేని కూడా చేరిపోయింది. చిన్న వయసులోనే సాయంలో తండ్రిని మించిపోయింది.
మహేష్ బాబు గారాల పట్టి సితార.. తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటుంది. నటనలోనే కాకుండా దానగుణంలో కూడా తండ్రిని మించిపోతుంది. మొదటి కమర్షియల్ యాడ్ లో నటించిన సితార.. తనకు వచ్చిన పారితోషికాన్ని ఛారిటీకి రాసిచ్చేసింది. దీంతో సితారను అభినందిస్తూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా సితార మరోసారి గొప్ప మనసు చాటుకుంది. తన పుట్టినరోజును పేద పిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. పేదలతో కలిసి చాలా మంది సెలబ్రిటీలు పుట్టినరోజులు జరుపుకున్నారు. ఇందులో కొత్తేముంది అని అనుకోకండి. నిజంగానే సితార బర్త్ డే వేడుకలో సమ్ థింగ్ స్పెషల్ ఉంది. అదేంటంటే.. తన బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న పేద పిల్లలకు ఆమె బహుమతులు ఇచ్చింది.
జూలై 20న సితార పుట్టిన రోజు సందర్భంగా తన బర్త్ దేని మహేష్ బాబు ఫౌండేషన్ లో జరుపుకుంది. అక్కడ ఆడ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసింది. అనంతరం అక్కడున్న వారందరికీ పింక్ కలర్ లేడీస్ సైకిళ్లను బహుమతిగా ఇచ్చింది. దీంతో అక్కడున్న ఆడపిల్లలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సితార తమతో కలిసి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడం.. తమకు సైకిల్ బహుకరించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. నిజంగా చిన్న వయసులో ఇతరుల గురించి ఆలోచించడం అంటే సాధారణ విషయం కాదు. తన తోటి పిల్లల కోసం ఇలా ఆలోచించిందంటే గొప్ప విషయమే. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సితార మంచి మనసుకు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై మహేష్ స్పందిస్తూ.. ‘11వ ఏటలో అడుగుపెట్టినందుకు సంతోషం.. నువ్వు నా స్టార్ వి. నువ్వు అనుకున్నది సాధిస్తావ్’ అంటూ ట్వీట్ చేశారు. ఇక నమ్రతా శిరోద్కర్ తన ఇన్ స్టా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ చిన్నారులు తమ కొత్త రైడ్ పట్ల సంతోషంగా ఉన్నారు. పాఠశాల కేవలం సైకిల్ పై వెళ్లేంత దూరంలో ఉంది. నీలో ఉన్న ఆలోచనాత్మక, ప్రేమను చూపించే పెద్ద మనసుకి లవ్ యు చిట్టి తల్లి. నీ మహిమాన్వితమైన ప్రయాణంలో ఇలాంటి అర్థవంతమైన జ్ఞాపకాలను ఎన్నో సృష్టించాలని కోరుకుంటున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ రాసుకొచ్చారు. నిజంగా ఒక యువరాణి.. విలాసవంతంగా తన బర్త్ డే వేడుకలు చేసుకోవచ్చు కానీ చాలా సింపుల్ గా, ఆర్భాటం లేకుండా పేద పిల్లలతో కలిసి జరుపుకుంది. హ్యాట్సాఫ్ సితార. జన్మదిన శుభాకాంక్షలు. మీరు కూడా సితారకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి.
Little girls happy with their new ride 🚴 Now school is just a bicycle away!!
May you make many more such meaningful memories along your glorious journey!
Happy birthday #SitaraGhattamaneni 🥳❤️#HBDPrincessSitara @urstrulyMahesh pic.twitter.com/4kKqiUpZw1— Mahesh Babu Foundation (@MBfoundationorg) July 20, 2023