తాజాగా ఓ కార్యక్రమంలో పాల్టోన్న మహేష్ బాబు తను నటించిన గుంటూరు కారం సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్అ వుతున్నాయి.
అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం గుంటూరు కారం. ‘హైలీ ఇన్ఫ్లేమ్మబుల్’ ట్యాగ్ లైన్ పెట్టారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ అలియాస్ చినబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజ హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ ఎస్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ మధ్యే ఈ మూవీకి సంబంధించి గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. కాగా, ఈ సినిమా షూటింగ్ సైతం కొంత వరకు పూర్తైనట్లు సమాచారం. ఈ నెల నుంచి కొత్త షెడ్యూల్ ను ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. ఇక త్వర త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర దర్శకుడు, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గోన్న మహేష్ బాబు గుంటూరు కారం సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చాడు. ఇప్పుడవి సోషల్ మీడియాలతో ట్రెండ్ అవుతున్నాయి.
గుంటూరు కారం సంక్రాంతికి వస్తుందా..? అని యాంకర్ అడగగా మహేష్ బాబు మాట్లాడుతూ..”సినిమా సంక్రాంతికి వస్తొంది, మీరు మూవీ చూశాక చాలా ఆనందపడ్తారు”. అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. “అలాగే వివిధ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న నేను వాటినుంచి వస్తున్న ఆదాయంలో కొంత భాగాన్ని సమాజ సేవ కోసం ఉపయోగిస్తున్నా. గౌతమ్ పుట్టినపటి నుంచి ఏదో విధంగా చిన్నపిల్లలకు సాయం చేయలని అనుకున్నా. అందుకే చిన్నారుల గుండె ఆపరేషన్లకు నా వంతు సహకారం అందిస్తున్నా. అలాగే రీరిలీజ్ ద్వారా వచ్చిన మొత్తాన్ని కూడా సాయం కోసమే అందిస్తున్నా. అందరిలా నేను స్మార్ట్ఫొన్ ఎక్కువగానే వాడుతాను. ఫోన్ చూసే సమయాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నా”. అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ సినిమా బ్యాలెన్స్ షూటింగ్ ఇంకా కొన్ని రోజులు ఉన్నట్లు తెలుస్తొంది. దాని తర్వాత పోస్ట్ ప్రోడక్షన్ పనులు, ప్రమోషన్ లు వంటివి ప్లాన్ చేస్తారట. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ కూడా రానున్నట్లు సమాచారం. నిజానికి మహేష్ బాబు పుట్టినరోజునే సినిమా నుంచి మొదటి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని ఆపేశారు. ఈ సినిమా లో మహేష్ బాబు స్టైలీష్ లుక్ లో ఉండనున్నట్లు గ్లింప్స్ లో చూశాం. ఫ్యాన్స్ అయితే చొక్కాలు చింపుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. బీడీ త్రీడిలో కనిపిస్తే ఎలా ఉంటుందో.. చూడాలనుకుంటే మరి కొన్ని రోజలు వేచి ఉండాల్సిందే.