వంశీ సినిమాతో మహేష్ బాబు- నమ్రత మధ్య ఏర్పడిన పరిచయం వీరిని పెళ్లి దాకా నడిపించింది. అప్పుడే కెరీర్ ప్రారంభించిన మహేష్ బాబు.. ఆ సినిమా హీరోయిన్ నమ్రత ప్రేమలో పడి జీవిత భాగస్వామిని చేసుకున్నారు. మరి వీరి లవ్ ట్రాక్ లో ఆసక్తికర విషయాలు ఏంటనేవి ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ మహేష్ బాబు, నమ్రత లవ్ మ్యారేజ్ చేసుకొని జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు. సినిమా పరిశ్రమల్లో పెళ్లి చేసుకొని చాలా జంటలు విడిపోవడం చూస్తున్నాము. కానీ మహేష్, నమ్రత మాత్రం వీటన్నిటికి చాలా దూరం ఉంటారు. నిజమైన ప్రేమ జంట ఎలా కలిసుండాలో చెప్పే జంటగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వంశీ సినిమాతో ఏర్పడిన పరిచయం వారిని పెళ్లి దాకా నడిపించింది. అప్పుడే కెరీర్ ప్రారంభించిన మహేష్ బాబు.. ఆ సినిమా హీరోయిన్ నమ్రత ప్రేమలో పడి జీవిత భాగస్వామిని చేసుకున్నారు. అయితే అప్పట్లో మీడియా ప్రభావం పెద్దగా లేకపోవడంతో వీరి పెళ్లికి సంబంధించిన వివరాలు జనాలకు పెద్దగా తెలియదు.
2000 సంవత్సరంలో ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబు, నమ్రత, మధ్య ప్రేమ మొదలైంది. మొదట దగ్గరై ఆ తర్వాత లవ్ లో పడిన ఈ జంట దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం నడిపించింది. 2005 ఫిబ్రవరి 10న మహేష్, నమ్రత ఒక్కటయ్యారు. వంశీ షూటింగ్ అవుట్ డోర్ లో చేసినప్పుడు అక్కడే కొన్ని రోజులు ఉన్నారు. ఈ సమయంలో దాదాపు నెల రోజులు అక్కడే ఉన్నారట. అదే సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, వీరి స్నేహం కాస్తా ప్రేమకు దారి తీసిందట.
తాజాగా ఓ జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కు వెళ్లిన నమ్రత కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ. “నాకు పెద్దగా నగలు గట్రా నచ్చవు, చాలా వరకు సింఫుల్ గా ఉండటానికి ఇష్టపడతాను. షాపింగ్ కూడా అంత ఇష్టముండదు. మహేష్ బాబు నాకు ఇచ్చిన మొదటి బహుమతి వెడ్డింగ్ రింగ్. అది ఎప్పటికీ నాకు ఎవర్ గ్రీన్ గిఫ్ట్ అని చెప్పింది. అలాగే మా అమ్మ బంగారు ఉంగరం 8 ఏళ్ల వయసులో అమ్మ నాకు సాయిబాబా ఉంగరం ఇచ్చింది. ఇప్పటికీ నేను దాన్ని ధరిస్తున్నాను. ఇకపోతే మహేష్ బాబుతో కలిసి నటించబోతున్నారని, రీఎంట్రీ ఇవ్వనున్నారట అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు” అంటూ చెప్పుకొచ్చింది.