ప్రేమ.. ఈ రెండక్షరాల పదానికి ఉన్న శక్తి మాములుది కాదు. దీని ముందు మరేశక్తి నిలవలేదు. ప్రేమ కోసం బలైన వారు ఈ చరిత్రలో ఎందరో ఉన్నారు. ప్రేమ ఓ మనిషిని పాతాళానికి తొక్కేయగలదు.. అత్యున్నత శిఖరానికి చేర్చగలదు. అయితే ప్రస్తుతం సమాజంలో ప్రేమ పేరుతో చోటు చేసుకుంటున్న నేరాల సంఖ్య పెరిగిపోతుంది. ప్రేమించిన వాడిని దక్కించుకోవడం కోసం కన్నవారిని, కట్టుకున్న వారిని చంపేవారు కొందరైతే.. నాకు దక్కని మనిషి మరేవరికి దక్కకూడదనే ఉన్మాదంతో.. ప్రేమించిన వారి ప్రాణాలు తీసేవారు కొందరు. ఈ తరహా నేరాలు నిత్యం ఏదో ఓ చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి గుజరాత్‌లో చోటు చేసుకుంది. ప్రేమించిన యువతి మీద కోపంతో.. ఆమె చెల్లి భర్త జీవితాన్ని నాశనం చేశాడు ఓ వ్యక్తి. ఏకంగా బాంబును గిఫ్ట్ ప్యాక్ చేసి వారికి పంపాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ వివరాలు..
గుజరాత్, నవ్‌సారీ జిల్లా వంసదా ప్రాంతం మింద్‌భారీ గ్రామానికి చెంది హరీశ్ దల్వీకి ఇద్దరు కుమార్తెలు. కొన్ని రోజుల క్రితమే తన చిన్న కుమార్తె సల్మాకు ఆడంబరంగా పెళ్లి చేశాడు. అనుకున్న దానికంటే బాగా వివాహ వేడుక పూర్తయ్యింది. బంధవులు ఎవరింటికి వారు వెళ్లారు. కుమార్తె కూడా అత్తింటికి వెళ్లింది. హమ్మయ్య.. బాధ్యతలు తీరాయని విశ్రాంతిగా ఉన్నాడు హరీశ్ దల్వీ. ఈ క్రమంలో ఓ రోజు అతడికి చిన్న కుమార్తె సల్మా నుంచి ఫోన్ వచ్చింది. మొబైల్‌లో మాట్లాడుతూ.. తన అత్తవారింట్లో బాంబు పేలిందని.. తన భర్తకు తీవ్ర గాయాలయ్యానని తెలిపింది.
ఇది కూడా చదవండి: Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రయాణిస్తున్న విమానంలో పొగలు! భయంతో కేకలు వేసిన ఆటగాళ్లు
వెంటనే హరీశ్ దల్వా తన కుమార్తె ఇంటికి వెళ్లాడు. ఏం జరిగిందని ఆరా తీయగా.. పెళ్లికి వచ్చిన గిఫ్ట్స్‌లను ఒపెన్ చేస్తుండగా.. వాటిలో ఒకటి పేలిందని తెలిపింది. ఆ గిఫ్ట్ ఎవరు ఇచ్చారో అని చూడగా.. దాని మీద హరీశ్ పెద్ద కుమార్తె జాగృతి.. స్నేహితురాలు ఆరతి పేరు ఉంది. ఆమెను నిలదీయగా.. తనకు ఏం తెలియదని.. ఆ గిఫ్ట్‌ను రాజేశ్ పటేల్ ఇచ్చారని ఆమె చెప్పింది. ఆ పేరు వినగానే హరీశ్ దల్వా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ‘ఆ నీచుడు.. నా పెద్ద కుమార్తె జీవితాన్ని నాశనం చేశాడు.. ఇప్పుడు చిన్న బిడ్డ జీవితాన్ని కూడా నరకం చేశాడే’ అని పెద్ద పెట్టును రోదించసాగాడు.ఆ వెంటనే తేరుకుని.. పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. హరీశ్ దల్వా తెలిపిన వివరాల ప్రకారం.. అతడి పెద్దమ్మాయి జాగృతి, కొన్నేళ్ల క్రితం రాజేశ్ పటేల్ అనే వ్యక్తిని ప్రేమించింది. వారిద్దరు ఏడేళ్లు లివ్ ఇన్ రిలేషన్‌లో కూడా ఉన్నారు. వారికి ఓ కుమార్తె జన్మించింది. పెళ్లి చేసుకుందామనుకుంటుండగా.. రాజేశ్ పటేల్ గురించి జాగృతికి కొన్ని భయంకర నిజాలు తెలిశాయి. అతడికి అప్పటికే వివాహం అయ్యి.. ఇద్దరు పిల్లలున్నట్లు తెలిసింది. మోసపోయానని గ్రహించిన జాగృతి కుమార్తెని తీసుకుని పుట్టింటికి వెళ్లింది.
ఇది కూడా చదవండి: Gujarat: మరికొన్ని గంటల్లో పెళ్లి.. డీజే పాటలకు డ్యాన్స్ చేస్తూ వరుడు మృతి!
ఇక అప్పటి నుంచి రాజేశ్ పటేల్ జాగృతిని వేధించడం ప్రారంభించాడు. పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమె ఇంటికి వద్దకు వచ్చి గొడవ చేసేవాడు. అయతే ఎప్పటికైనా అతడి వల్ల తన కుమార్తె జాగృతికి ప్రాణాపాయం ఉంటుందని భావించిన హరీశ్ దల్వా.. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అప్పటి నుంచి మరింత ఆగ్రహంతో ఉన్న రాజేశ్.. ఇలాంటి దారుణానికి ఒడిగట్టాడు. జాగృతి సోదరి పెళ్లి అని తెలుసుకున్న రాజేశ్.. తన స్నేహితుడితో కలిసి టెడ్డీ బేర్‌లో బాంబు ఫిక్స్ చేసి.. దాన్ని జాగృతి స్నేహితురాలు ఆరతికి ఇచ్చాడు. జాగృతి తన దగ్గర నుంచి ఎలాంటి గిఫ్గ్ తీసుకోవడం లేదని.. ఎలా అయినా సరే.. దీన్ని ఆమెకు ఇవ్వాలని కోరాడు. ఈ బాంబ్ ద్వారా జాగృతిని చంపాలని భావించాడు రాజేశ్. కానీ దురదృష్టవశాత్తు అది జాగృతి సోదరికి చేరింది.
ఇది కూడా చదవండి: 3 రోజులుగా ఆకాశం నుంచి పడుతున్న వింత వస్తువులు.. భయాందోళనలో జనాలు!వివాహం పూర్తయిన తర్వాత.. తీరిగ్గా.. వచ్చిన గిఫ్ట్‌లను ఒపెన్ చేశారు జాగృతి సోదరి సల్మా దంపతులు. ఈ క్రమంలో టెడ్డీబేర్ ఒపెన్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సల్మా భర్త.. కళ్లు పోవడమే కాక.. అతడి ఎడమ చేయి పూర్తిగా దెబ్బతిన్నది. అంతేకాక అతడి మేనల్లుడు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలిసిన హరీశ్.. ఇప్పుడు నా కుమార్తె జీవితం ఎలా సాగుతుంది.. నా రెండు కళ్లలో ఒకదాన్ని మా అల్లుడికి ఇస్తాను అని రోదిస్తున్నాడు. అతడి వేదన చూసి అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. ప్రస్తుతం పోలీసులు.. రాజేశ్‌తో పాటు అతడికి సాయం చేసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.