కేంద్రంలో ప్రధాని మోదీ పేద కుటుంబాల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారు. విద్యా, ఆరోగ్యం, ఆర్థిక సాయం చేకూరే విధంగా అనేక సౌకర్యవంతమైన స్కీమ్స్ అందుబాటులోకి తీసుకువచ్చారు.
కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కొరకు అనేక పథకాలను ప్రవేశపెట్టారు. అందులో భాగంగా ముఖ్యమైనది.. ప్రజల ఆరోగ్య దృష్ట్యా తీసుకువచ్చిన పథకం ‘ఆయుష్మాన్ భారత్’ ఒకటి. దీంతో ప్రజల ఆరోగ్య, వైద్య సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుంది. భారత్ అనుసరిస్తున్న ఆరోగ్య విధానాలు ప్రశంసిచదగ్గవి అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధ్నామ్ అన్నారు. గుజరాత్ గాంధీనగర్‌లో శుక్రవారం జరిగిన జీ 20 సదస్సు ఆరోగ్య శాఖ మంత్రుల సమావేశానికి ముఖ్య అతిథిగా అధ్నామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకాన్ని కొనియాడారు. మరిన్ని విషయాలను తెలుసుకుందాం..
సదస్సు ప్రారంభోత్సవం సందర్భంగా అధ్నామ్ మాట్లాడుతూ.. ఈ సదస్సును నిర్వహిస్తున్నందుకు భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యపరంగా ఇండియా అనుసరిస్తున్న పథకాలను ప్రశంసించారు. ఆయన ఓ ఆరోగ్య సంరక్షణ కేంద్రానికి వెళినపుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా దాదాపుగా వెయ్యి గృహాల వరకు సేవలందించడం చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. గుజరాతో రాష్ట్రంలో కూడా టెలీ-మెడిసిన్ సదుపాయం కూడా బాగుందని మెచ్చుకున్నారు. వైద్యరంగంలో డిజిటల్ సేవలు అందించడం ఓ విప్లవాత్మకమైన మార్పు అని టెడ్రోస్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కేంద్ ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మాట్లాడుతూ.. ఈ సమావేశాలకు సుమారు 70 దేశాల నుండి ఆరోగ్యశాఖ మంత్రులు, ప్రతినిధులు హాజరైనట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని కొనియాడారు. ఆగస్టు 17న మొదలైన ఈ సమావేశాలు శనివారం ముగియనున్నాయి. ‘ఈ జీ 20 సమావేశం ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి సారించింది. అత్యవసర ఆరోగ్య సమస్యలు నివారణ, యాంటీ మైక్రోబయాల్ రెసిస్టెన్స్‌ను అధ్యయనం చేసి పరిస్థితులకు అనుగుణంగా స్పందించడం. నాణ్యమైన సేవలందించే విధంగా ఫార్మసీ రంగాన్ని బలోపేతం చేయడం గురించి ప్రస్తావించడం జరిగింది’ అని కేంద్ర మంత్రి తెలిపారు.