ఈ కాలంలో ప్రతి చిన్న విషయానికి లంచం డిమాండ్ చేస్తున్నారు. అన్ని రంగాల్లో లంచం క్యాన్సర్ లో ప్రబలిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి చిన్న పనికి లంచం ఇస్తేనే పని జరుగుతుందన్న పరిస్థితి ఏర్పడింది. ప్యూన్ నుంచి ఉన్నతాధికారుల వరకు లంచం డిమాండ్ చేస్తుంటారు. లంచం తీసుకుంటున్నవారిపై ఎప్పటికప్పుడు ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా.. కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు.
దేశంలో లంచం ఒక క్యాన్సర్ లో ప్రబలిపోతుంది.. ప్రభుత్వ కార్యాలయంలో ఏ చిన్న పని చేయాలన్నా ప్యూన్ నుంచి ఉన్నతాధికారుల వరకు లంచం డిమాండ్ చేస్తుంటారు. లంచం తీసుకుంటున్నవారిపై ఎప్పటికప్పుడు ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నప్పటికీ కొందరిలో మార్పు రావడం లేదు. ప్రస్తుతం కాలంలో ప్రతి రంగంలోనూ లంచగొండితనం కొనసాగుతుంది. ఓ రైతు తనకు రావాల్సిన ఉపాధి హామీ బిల్లు కోసం ఆఫీస్ కి వెళ్తే అధికారి డబ్బులు డిమాండ్ చేశాడు. సహనం నశించిన ఆ రైతు ఏకంగా ప్రభుత్వ కార్యాలయానికి తన ఎద్దులను తీసుకు వెళ్లిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం లేనిదే పని జరగదు అని మరోసారి రుజువైంది. కాకపోతే ఆ లంచగొండి అధికారికి రైతు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. ఉపాధి హామీ బిల్లులను చెల్లించేందుకు డబ్బులు డిమాండ్ చేసిన అధికారకి రైతు ఏకంగా ప్రభుత్వ కార్యాలయానికి తన రెండు ఎద్దులను తీసుకు వెళ్లి డబ్బుకు బదులుగా ఈ ఎద్దులను తీసుకోవాల్సిందిగా ప్రాదేయపడ్డారు. దీంతో అక్కడ ఉన్నవారంతా బిత్తరపోయారు. బీదర్ జిల్లాకు చెందిన ప్రశాంత్ బిరాదార అనే రైతు తనకు బకాయి పడ్డ ఉపాధి హామీ పథకం నిధులకు సంబందించి బిల్లు చేయించుకోవడానికి కొన్ని నెలలుగా బసవకల్యాన్ గ్రామ పంచాయితీ చుట్టు తిరిగాడు. ఈ క్రమంలో ప్రశాంత్ కి మంజూరైన బిల్లులో కొంత మొత్తం చెల్లించగా మిగతా డబ్బు చెల్లించేందుకు అధికారి లంచం డిమాండ్ చేశాడు. తన వద్ద ప్రస్తుతం డబ్బులు లేవని.. పని అయ్యాక ఎంతో కొంత ఇస్తానని ప్రశాంత్ ప్రతిరోజూ ప్రాదేయపడుతూ వచ్చాడు.
కొన్ని నెలలుగా గ్రామ పంచాయితీ చుట్టు తిరిగిన ప్రశాంత్ బిరాదార కన్నీరు పెట్టుకొని ప్రాదేయపడ్డా అధికారి కనికరించలేదు. అధికారి తీరుకు విసిగిపోయిన ప్రశాంత్ తాను పెంచుకుంటున్న ఎద్దులను అధికారికి లంచంగా ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలోనే పంచాయతీ కార్యాలయానికి తన రెండు ఎద్దులను తొలుకు వచ్చి తన వద్ద డబ్బులు లేవు.. వాటికి బదులుగా ఈ ఎద్దులను లంచంగా తీసుకోండి అని అధికారిని కోరాడు. ప్రశాంత్ చేసిన పనికి అక్కడు ఉన్న అధికారులు, స్థానికులు బిత్తరపోయారు. సమాచారం అందుకున్న పంచాయతీ సహాయ సంచాలకులు సంతోష్ చవాన్ కార్యాలయానికి చేరుకొని ఆరాతీశారు. వెంటనే రైతు ప్రశాంత్ బిల్లు బకాయిని త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో తన ఎద్దులతో ప్రశాంత్ తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు.
ఇటీవల మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రైతు ప్రశాంత్ బారాదార్ తన పొలంలో కాంపౌండ్ గోడ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వానికి ధరకాస్తు చేసుకోగా లక్ష రూపాయలు నిధులు మంజూరు అయ్యాయి. ముందుగా రూ.55 వేలు ఇవ్వగా.. మిగతా రూ.45 వేలు ఇవ్వకుండా అధికారి లంచం డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే రైతు తన ఎద్దులను కార్యాలయానికి తీసుకు వెళ్లాడు. ఈ నెల 10న సరిగ్గా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. హవేరీ జిల్లాలో సవనూర్ మున్సిపాటిలీలో ఎల్లప్ప రానోజీ అనే ఓ రైతు రికార్డుల్లో తన పేరు మార్చడానికి అధికారికి లంచం ఇచ్చాడు. ఆ అధికారి బదిలీపై వెళ్లగా మరో అధికారి వచ్చి తనకు లంచం ఇవ్వాలని అడిగాడు. దీంతో విసుగెత్తిపోయిన ఎల్లప్ప తన ఎద్దును తీసుకొని ఆఫీస్ కి వెళ్లాడు. ఈ సంఘటన గురించి తెలిసిన ఉన్నతాధికారులు సదరు అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.