దేశ రక్షణ కోసం సరిహద్దులో వేలాది మంది సైనికులు నిత్యం విధులు నిర్వహిస్తుంటారు. దేశ కోసం తమ ప్రాణాలను సైతం అర్పిస్తుంటారు. నిత్యం అనుమానస్పదంగా ఏమి కనిపించిన వెంటనే స్వాధీనం చేసుకుంటారు. ఒక్కొక్కసారి అనుమానస్పందా వచ్చిన వాటిలో పేలుడు పదార్థాలు సైతం లభిస్తుంటాయి. తాజాగా దేశ సరిహద్దుల్లో ఓ షాకింగ్ ఘటన ఒకటి చోటుచేసుకుంది. ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారంతో దేశ సరిహద్దులో పహారా కాస్తున్న జవాన్లు అప్రమత్తం అయ్యారు. నదిలో కొట్టుకువచ్చిన నాలుగు ప్లాస్టిక్ క్యాన్ల గుర్తించారు. వాటిని నదిలో నుంచి బయటకు తీసి ఓపెన్ చేసి చూసిన సైనికులు ఒక్కసారిగా షాకయ్యారు. అందులో వందల సంఖ్యలో సెల్ ఫోన్లు లభ్యమయ్యాయి. ప్రస్తుతం ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతమైన పశ్చిమ బెంగాల్‌లోని మల్డా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద విధులు నిర్వహిస్తోన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కు ఇంటెలిజెన్స్ నుంచి ఓ సమాచారం వచ్చింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న సైనికులంతా అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 8న పాగ్లా నదిలో అరటి చెట్టు కాండంతోపాటు నాలుగు ప్లాస్టిక్ క్యాన్లు కొట్టుకు రావడం సైనికులు గుర్తించారు. వాటిని సైనికులు వెంటనే వాటని స్వాధీనం చేసుకున్నారు. ప్లాస్టిక్ క్యాన్లను ఓపెన్ చూసి సైనికులంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఆ క్యాన్లలో వివిధ కంపెనీలకు చెందిన సుమారు 317 మొబైల్ ఫోన్లను అధికారులు గుర్తించారు.
అధికారులు స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్‌ల విలువ సుమారు రూ.38.83లక్షల వరకు ఉంటుంది. సీజ్ చేసిన మొబైల్ ఫోన్లను ఇంగ్లిష్ బజార్‌లోని పోలీస్ అధికారులకు అందజేసినట్టు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీటి వెనుక ఉన్న నిందితులను పట్టుకుని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో స్మగ్లింగ్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు పశ్చిబెంగాల్ అధికారులు చెప్పారు. ఈ ఘటనతో సరిహద్దులు సైనికులు మరింత అప్రమత్తమయ్యారు.