ఈ మద్య చాలా మంది పనుల వత్తిడి వల్ల ఇంట్లో వంటలు వండుకోవడం తక్కువై బయట ఆన్ లైన్ లో పుడ్ ఆర్డర్ చేస్తున్నారు. నిమిషాల వ్యవధిలో తమకు కావాల్సిన ఐటమ్స్ తెప్పించుకుని ఎంచక్కా తింటున్నారు. అయితే కొన్నిసార్లు తాము ఆన్ లైన్ చేసినవి కాకుండా వేరే ఐటమ్స్ రావడం గమనిస్తుంటాం.. మరికొన్ని సార్లు ఆర్డర్ చేసిన ఐటమ్స్ లో పురుగులు, కుల్లిన పదార్థాలు, చిన్న చిన్న వస్తువులు రావడం చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది కస్టమర్లకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ఓ వ్యక్తి పిజ్జా ఆర్డర్ చేశాడు.. అందులో గాజు ముక్కలు రావడంతో ఖంగుతిన్నాడు. మహారాష్ట్రలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఒక కస్టరమ్ పిజ్జా కోసం పిజ్జా మేకింగ్ బ్రాండ్ అయిన డొమినాస్ కి ఆర్డర్ చేశాడు. జొమాటో నుంచి వచ్చిన డెలివరీ బాయ్ కస్టమర్ కి పిజ్జా బాక్స్ ఇచ్చి వెళ్లాడు. కస్టమర్ ఎంతో ఆశతో ఆర్డర్ చేసిన పిజ్జా బాక్స్ తెరిచి తినడానికి రెడీ అయ్యాడు.. అంతలో ఆ పిజ్జాలో ఒక గాజు ముక్క వచ్చింది. ఒకటే కదా అని పక్కన పెట్టాడు.. తర్వాత మరికొన్ని గాజు ముక్కలు రావడంతో మనోడికి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే గాజు ముక్కలు ఉన్న పిజ్జా ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను అంత బ్రాండెడ్ సంస్థ అయిన డొమినాస్ కి పిజ్జా ఆర్డర్ చేస్తే గాజు ముక్కలు ఉన్నది పంపారని పోస్ట్ లో పేర్కొన్నాడు. డొమినాస్ ఇండియా, ముంబాయి పోలీసులకు ట్యాగ్ చేశాడు బాధిత కస్టమర్.
కస్టమర్ చేసిన ట్వీట్ పై ముంబాయి పోలీసులు స్పందిస్తూ.. ముందుగా కస్టమర్ కేర్ ని సంప్రదించి తమకు జరిగిన అనుభవం గురించి చెప్పని సూచించారు. ఒకవేళ స్పందించకుంటే చట్టపరమైన చర్యలకు సిద్దం అవ్వండి అంటూ సలహా ఇచ్చారు. కాగా, ఈ విషయంపై డొమినోస్ సంస్థ స్పందించి.. కస్టమర్ కి కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరారు.. అంతే కాదు దీనిపై పూర్తి వివరాలు సేకరించి చర్యలు తీసుకునేందుకు సిద్దం అన్నారు. కస్టమర్లకు తాము ఎప్పుడూ నాణ్యమైన ఫుడ్ అందిస్తామని.. ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు అన్నారు.
2 to 3 pieces of glass found in @dominos_india This speaks volume about global brand food that we are getting @dominos @jagograhakjago @fssaiindia Not sure of ordering ever from Domino’s @MumbaiPolice @timesofindia pic.twitter.com/Ir1r05pDQk
— AK (@kolluri_arun) October 8, 2022