సాధారణంగా మన దేశంలో పుట్టిన వాళ్ళే పల్లెటూర్లలో ఉండడానికి ఇష్టపడరు. ఆ కరెంట్ కోతలు, సౌకర్యాలు సరిగా ఉండవని, రవాణా సౌకర్యం ఉండదని అసలు పల్లెటూరు మొఖమే చూడరు. ఇక అమ్మాయిలైతే పల్లెటూరులో ఉండే వ్యక్తులని పెళ్లి చేసుకోవడం అంటే ఆలోచిస్తారు. పెళ్లయ్యాక పల్లెటూర్లలో ఉంటే వద్దని చెప్పి సిటీ తీసుకొచ్చేస్తారు. కానీ ఒక యువతి మాత్రం విలాసాలు వదిలేసి విలేజ్ లో జీవిస్తుంది. అది కూడా విదేశీ అమ్మాయి. అసలు అడ్జస్ట్ అవ్వలేక విలేజ్ ని వదిలేసి పారిపోయి వచ్చేస్తున్న ఈ రోజుల్లో ఒక విదేశీ అమ్మాయి.. ఒక భారతీయుడ్ని వివాహం చేసుకోవడం, విలేజ్ లో ఉండడం అంటే మామూలు విషయం కాదు.
హర్యానాకి చెందిన లవ్లీన్ అనే వ్యక్తి, ఆస్ట్రేలియాలో ఉండే జమీ కోర్టుని అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక పాప కూడా ఉంది. పెళ్ళై చాలా కాలం అయినప్పటికీ.. వీరికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దానికి కారణం ఆ యువతి పచ్చని పంట పొలాల మధ్య తల మీద గడ్డి మోపు పెట్టుకుని నడుస్తూ సందడి చేయడమే. తన భర్త ఆమె నెత్తి మీద పెద్ద పచ్చ గడ్డి మోపు ఎత్తి పెడతాడు. పట్టణాల మీద మోజుతో పల్లెలు ఖాళీ అవుతున్న ఈ రోజుల్లో ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన అమ్మాయి.. మన కల్చర్ ని తన సొంతంగా భావించి అడ్జస్ట్ అవుతున్నందుకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
లవ్లీన్ గతంలో ఆస్ట్రేలియాలో కొన్ని రోజులు పని చేసి ఉండవచ్చు. ఆ సమయంలో జమీ కోర్టుని పరిచయం అయి ఉండవచ్చు. అలా ప్రేమ ప్రయాణం ఇక్కడి వరకూ సాగి ఉండవచ్చు. కానీ భర్త కోసం ఆస్ట్రేలియా లాంటి దేశాన్ని వదిలి భారతదేశం రావడం అన్నది గొప్ప విషయమే అని చెప్పాలి. మన వాళ్ళు విదేశాలు పోదామని అనుకుంటారు. కొంతమంది అయితే అమెరికా వెళ్లే యోగ్యత ఉన్న వాళ్లనే పెళ్లి చేసుకుంటారు. ఆమె మాత్రం ఇండియాలో భర్తతో సెటిల్ అయ్యారు. ఇక ఈ జంటకి ఇన్స్టాగ్రామ్ లో 2 లక్షల మందికి పైగా అభిమానులు ఉన్నారు. అంతేకాదు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా మెయింటెయిన్ చేస్తున్నారు. యూట్యూబ్ లో 6 లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు.