అదృష్టం కలిసి రావాలే కానీ.. కటిక పేదవాడు కోటీశ్వరుడు అయిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా లాటరీ కొనుగోలు చేసిన వారికి ఊహించని జాక్ పాట్ తగిలి లక్షాధికారులు, కోటీశ్వరులు అయిన వారు ఎంతో మంది ఉన్నారు. కొన్ని సమయాల్లో లాటరీ గెల్చుకున్న వారు తమకు ప్రాణహాని ఉందని పోలీస్ మెట్లు ఎక్కిన సందర్భాలు ఉన్నాయి.
మనిషికి అదృష్టం అనేది ఎప్పుడు.. ఏవైపు నుంచి వస్తుందో అస్సలు ఊహించలేం. అప్పటి వరకు కడు పేదరికంలో ఉన్నవారు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి అదృష్టాలు లాటరీ టికెట్ గెల్చుకున్నవాళ్లకే సాద్యమవుతుంది. ఎంతో కాలంగా లాటరీ టికెట్స్ కొనుగోలు చేసేవారికి అప్పుడప్పుడు అదృష్టలక్ష్మి తలపు తడుతుంది. కొన్నిసార్లు లాటరీ గెల్చుకున్నవాళ్లు సంతోషం కంటే బాధ పడేవారు ఉన్నారు. తమను రక్షించండి బాబో అని పోలీస్ స్టేషన్ కి పరిగెత్తిన సందర్భాలు ఉన్నాయి. ఓ దినసరి కూలీ రూ.75 లక్షల లాటరీ గెల్చుకున్నాడు.. అంతలోనే పోలీస్ స్టేషన్ కి పరుగెత్తాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పశ్చిమ బెంగాల్ కి చెందిన ఎస్ కే బాదేశ్ కి లాటరీలు కొనే అలవాటు ఉంది. ఇటీవల కేరళ ప్రభుత్వ స్త్రీ శక్తి లాటరీ కొనుగోలు చేశాడు. అదృష్టవశాత్తు బాదేశ్ కి ఏకంగా రూ.75 లక్షల లాటరీ తగిలింది. అంతే బాదేశ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అంతా బాగుందీ అనుకున్న సమయంలో మనోడికి కొత్త కష్టాలు మొదలయ్యాయి. బాదేశ్ కి మళియాళం ఒక్క ముక్కరాదు. రాష్ట్రం కాని రాష్ట్రానికి బతుకుదెరువు కోసం వచ్చాడు. తనను ఎవరైనా మోసం చేసి ఆ లాటరీ లాగేసుకుంటారమో అన్న భయం మొదలైంది. దాంతో వెంటనే పోలీస్ స్టేషన్ కి పరుగులు పెట్టాడు. తనకు రక్షణ కావాలని పోలీసులను కోరాడు. లాటరీ గెల్చుకున్న బాదేశ్ తన చుట్టుపక్కల వాళ్లపై అనుమానం మొదలైంది.. దాంతో వెంటనే మంగళవారం రాత్రి మువట్టపుజ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనకు లాటరీలో రూ.75 లక్షలు వచ్చాయని.. లాటరీ విధి విధానాలు తనుకు తెలియదని.. తనకు ఫ్రైజ్ మనీ ఇప్పించి రక్షణ కల్పించాల్సిందిగా పోలీసులను వేడుకున్నాడు బాదేశ్.
బాదేశ్ ఇబ్బందిని అర్ధం చేసుకున్న మువట్టుపుజ పోలీసులు అతనికి అన్ని రకాలుగా రక్షణ కల్పిస్తామని హామీ ఇవ్వడమే కాదు.. లాటరీ విధి విధానాలు పూర్తిగా అర్థమయ్యేలా వివరించారు. దీంతో సంతోషంలో మునిగిపోయాడు బాదేశ్. ఈ సందర్భంగా బాదేశ్ మాట్లాడుతూ.. ‘గతంలో ఎన్నో లాటరీలు కొన్నాను.. నాకు ఎప్పుడూ ఒక్క లాటరీ కూడా తగలలేదు.. కేరళలో కొన్న లాటరీకి భలే అదృష్టం కలిసి వచ్చింది. కేరళాకు వచ్చి ఏడాది అవుతుంది.. మళియాళం గురించి ఏమీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించాను. డబ్బులు చేతికి అందగానే సొంతఊరిలో ఇంటిని బాగుచేసుకుంటాను.. నా కుటుంబానికి ఖర్చు చేస్తాను’ అని సంబరపోయాడు బాదేశ్.