ఇటీవల ఎక్కువ మంది కాలక్షేపం చేస్తుంది ఫోనుతోనే. ఫోన్లలో ఉండే సోషల్ మీడియా యాప్స్‌లో తలదూర్చితే చాలు పక్కన పెద్ద పిడుగు పడినా పట్టించుకోరు. అంతగా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నారు ఇన్ఫ్లుయన్సర్లు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లకు చాలా క్రేజ్ వచ్చింది
ఇటీవల ఎక్కువ మంది కాలక్షేపం చేస్తుంది ఫోనుతోనే. ఫోన్లలో ఉండే సోషల్ మీడియా యాప్స్‌లో తలదూర్చితే చాలు పక్కన పెద్ద పిడుగు పడినా పట్టించుకోరు. అంతగా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నారు ఇన్ఫ్లుయన్సర్లు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లకు చాలా క్రేజ్ వచ్చింది. ఫోనుతోనే వీడియోలు చేసి ఫేమస్ అయిపోయిన వారున్నారు. దీనికి చదువు, సంధ్యలతో పనిలేదు. అనుభవం పెద్దగా అవసరం లేదు. కేవలం టాలెంట్ ఉంటే సరిపోతుంది. కొద్దికాలంలోనే డబ్బుతో పాటు పేరు, గౌరవ మర్యాదలు సంపాదిస్తున్నారు. వారిని చూసి మరికొంత మంది సోషల్ మీడియాలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ఓవర్ నైట్ స్టార్స్ అయిపోదామని, సోషల్ మీడియా మీద మోజుతో ఓ తల్లిదండ్రులు చేసిన పని దేశ మొత్తం నివ్వెర పోయేలా చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసేందుకు ఐఫోన్ కోసం కడుపున పుట్టిన బిడ్డనే దంపతులు అమ్మేసిన ఉదంతమిది. మానవ జాతి విస్తుపోయే ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పానిహతిలోని గాంధీనగర్‌కు చెందిన జయదేవ్, సతి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఏడేళ్ల కుమార్తెతో పాటు 8 నెలల పిల్లవాడు ఉన్నాడు. అయితే కొన్ని రోజులుగా పిల్లవాడు కనిపించకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది.
అలాగే ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న దంపతుల చేతిలో ఐఫోన్ కనిపించడం, రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో దర్శనమిస్తుండటంతో ఇరుగు పొరుగు వారు దంపతులను నిలదీయడం మొదలు పెట్టారు. దీంతో తమ బిడ్డను అమ్మేసి.. ఆ డబ్బుతో ఐ ఫోన్ కొన్నట్లు వెల్లడించారు. ఈ విషయం స్థానికులు పోలీసులకు తెలపడంతో వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. తల్లిని అదుపులోకి తీసుకోగా, తండ్రి జయదేవ్ పరారీలో ఉన్నాడు. బిడ్దను కొనుగోలు చేసిన మహిళను ప్రియాంగ ఘోష్‌గా గుర్తించి పట్టుకున్నారు. ఇందులో మరో విషయమేమింటంటే.. తన ఏడేళ్ల కుమార్తెను కూడా అమ్మేయాలని అనుకున్నట్లు తెలిసింది. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు కడుపున పుట్టిన బిడ్డను అమ్ముకోవడం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
She falsely accused her parents in law and made them arrested. After she sold her son for an iPhone. Wow. Women are all victims. Really. https://t.co/whrvlMJwCp
— Elisabetta Mazza (@MazzaElisabetta) July 27, 2023