ఆర్ధిక సమస్యల నుండి బయట పడాలంటే ఇంట్లో శంఖాన్ని దక్షిణ దిక్కుకి ఉంచండి. దీని వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. శంఖాన్ని ఇంట్లో పెట్టేటప్పుడు ముందు దానిని శుభ్రం చేసి ఆ తర్వాత మాత్రమే పెట్టండి. ప్రతి రోజు లక్ష్మీ దేవిని పూజించడం తో పాటు లక్ష్మీదేవి పక్కన శంఖాన్ని ఉంచి దానిని కూడా పూజించండి. దీంతో ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే పూర్తిగా దూరం అయి పోతాయి. దక్షిణావర్తి శంఖం పూజించడం వల్ల వ్యాపారంలో లాభాలు రావడానికి ఇది బాగా మేలు చేస్తుంది.ఆర్థిక సమస్యలను పూర్తిగా దూరం చేస్తుంది.
శంఖం పూరించకుండా పూజ ముగించకూడదని ఒక ఆచారం ఉంది. పెద్ద పెద్ద దేవాలయాల్లో గర్భగుడి తలుపులు తీసేటప్పుడు కూడా శంఖాన్ని ఊదుతారు. మన భారతీయ సంస్కృతిలో శంఖానికి ఒక ప్రత్యేక స్థానం ఉండటానికి కారణం అది సముద్ర మథన సమయంలో పాల సముద్రం నుండి బయటకు రావటమే. అలా బయటపడిన దానిని శ్రీ మహావిష్ణువు ధరించాడు, దానికే పాంచజన్యం అని పేరు.
శంఖధ్వనికి రెండువేల ఆరువందల అడుగుల దూరంలో ఉండే క్రిములు కూడా స్పృహ తప్పి పోతాయట. అంతేకాదు వైద్యశాస్త్రంలో కూడా దీనికి మంచి గుర్తింపు ఉంది. రోజూ శంఖాన్ని ఊదేవారికి శ్వాస సంబందిత వ్యాధులు దగ్గరకి రావట. ఆస్త్మా కూడా తగ్గుతుందని ఒక అధ్యయనం తెలిపింది.
అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే శంఖాన్ని పూజ చేసేటప్పుడు తులసి దళాలతో పూజ చేయండి దీంతో సమస్యలు ఉండవు. దేముడు గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచటం వల్ల శుభాలు జరుగుతాయని ఒక నమ్మకం.