ధనం ద్వారా కీర్తి, సుఖాలు, సంతోషము ఎన్నోకలుగుతాయి. అలాంటి ధనాన్ని సంపాదించటం ద్వారా భూమిపై స్వర్గసుఖాలను అనుభవించగలరు. అన్ని సుఖాలనిచ్చే ధనం వృధాగా పోకుండా చూసుకోవాలి. సంపదలకు మూలమైన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భావిస్తారు. లక్ష్మీ కటాక్షం కోసం అనేక ప్రార్థనలు చేస్తారు. అయితే కొన్ని విధాలుగా పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందట. కుబేరుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే లక్ష్మీ సంతోషిస్తుందట. ప్రపంచంలోని అన్ని సంపదలు కుబేరుడు అధీనంలో ఉంటాయి. కుబేరుడు ఉండే స్థానంలో పరిశుభ్రతను […]
ఆర్ధిక సమస్యల నుండి బయట పడాలంటే ఇంట్లో శంఖాన్ని దక్షిణ దిక్కుకి ఉంచండి. దీని వల్ల లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుంది. శంఖాన్ని ఇంట్లో పెట్టేటప్పుడు ముందు దానిని శుభ్రం చేసి ఆ తర్వాత మాత్రమే పెట్టండి. ప్రతి రోజు లక్ష్మీ దేవిని పూజించడం తో పాటు లక్ష్మీదేవి పక్కన శంఖాన్ని ఉంచి దానిని కూడా పూజించండి. దీంతో ఆర్థిక సమస్యలు ఏమైనా ఉంటే పూర్తిగా దూరం అయి పోతాయి. దక్షిణావర్తి శంఖం పూజించడం వల్ల వ్యాపారంలో లాభాలు […]
గోరింటాకు గౌరీదేవి ప్రతీక. గౌరి ఇంటి ఆకు – గోరింటాకుగా మారిందని మన పురాణాలు చెబుతున్నాయి. గోరింటాకు పుట్టుక వెనుక ఒక కథ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. భారతీయులు పాటించే ప్రతి ఆచారం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అనాది నుంచి నేటి టాటూల యుగం వరకు అమ్మాయిలకు ఎవర్‌గ్రీన్ ఫ్యాషన్ ట్రెండ్‌గా మారిందీ గోరింటాకు. అందుకే పెండ్లి అయినా పెరంటమైనా పండుగ అయినా ఫంక్షన్ అయినా గోరింటాకు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా ఆషాఢమాసం […]
ఉదయపు సంధ్య వేళ ఆలోచించడం ఉత్తమం, మధ్యాహ్నం ఆ ఆలోచనకు కార్యరూపం ఇవ్వడం, సాయంత్రం తినడం, రాత్రి నిద్రపోవడం ఉత్తమ లక్షణాలు’ అటు ప్రముఖ ఆంగ్ల కవి, పెయింటర్ విలియం బ్లేక్ ఇచ్చిన సందేశం పూర్తిగా తప్పని వైద్యులు తేల్చారు. రోజు వారిగా ఉండే పని ఒత్తిడి కారణంగా మధ్యాహ్నం కాస్త అలా నిద్ర పోవాలనిపిస్తుంది, పొద్దున్నే ప్రారంభమైన మన దినచర్య సాయంత్రం వరకు బిజీగా ఉంటుంది. బాగా అలసిపోయినప్పుడు శరీరం రెస్ట్ కోరుకుంటుంది. మధ్యాహ్నం గంటపాటు […]
కొవిడ్‌తో బాధపడిన తర్వాత నెగటివ్ వచ్చింది కదా అని ఊరికే ఉండకుండా మంచి పోషకాలున్న ఆహారం తినడం అలవాటు చేసుకోవాలి. కీళ్లనొప్పులు, శ్వాసతో ఇబ్బంది, పొడి దగ్గు, ఒత్తిడి, డిప్రషన్, జుట్టు రాలిపోవటం లాంటి సమస్యలు ఎదుర్కొన్న కొవిడ్ బాధితులు ఈ ఆహారం తీసుకోవటం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. మాంసకృత్తులు, పిండి పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, పీచు ఉన్న ఆహారంలోనే ఎక్కువగా పోషక విలువలు ఉంటాయని, ముఖ్యంగా బియ్యం, పప్పు, తృణధాన్యాలు వంటివి ఆహారంలో ఉండేలా […]