ధనం ద్వారా కీర్తి, సుఖాలు, సంతోషము ఎన్నోకలుగుతాయి. అలాంటి ధనాన్ని సంపాదించటం ద్వారా భూమిపై స్వర్గసుఖాలను అనుభవించగలరు. అన్ని సుఖాలనిచ్చే ధనం వృధాగా పోకుండా చూసుకోవాలి. సంపదలకు మూలమైన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భావిస్తారు. లక్ష్మీ కటాక్షం కోసం అనేక ప్రార్థనలు చేస్తారు. అయితే కొన్ని విధాలుగా పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందట. కుబేరుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే లక్ష్మీ సంతోషిస్తుందట. ప్రపంచంలోని అన్ని సంపదలు కుబేరుడు అధీనంలో ఉంటాయి. కుబేరుడు ఉండే స్థానంలో పరిశుభ్రతను పాటించాలి.
ఏల్నాటిశనితో బాధపడుతున్న వారూ, వ్యాపారంలో లాభాలను కోరుకునేవారు శ్రీఫలాన్ని పూజగదిలో కానీ, క్యాష్బాక్సులో కానీ ఉంచితే ఎనలేని విజయాలు సొంతమవు తాయంటారు. మెర్క్యూరీ లక్ష్మీ విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే దీనికి దేవి ఆకర్షిత మవుతుంది.పిల్లలు ఆడుకునే గవ్వలు సముద్రం నుంచి లభిస్తాయి.
లక్ష్మీదేవి కూడా పాల సముద్రం నుంచే ఉద్భవించింది కాబట్టి వీటిని పూజగదిలో ఉంచితే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. మోతీ శంఖాన్ని మంత్ర, తాంత్రిక పూజల్లో ప్రత్యేకంగా వినియోగిస్తారు. ఇవి చాలా అద్భుతమైన శంఖంగా నమ్ముతారు. వీటిని కూడా ఇంట్లో ఉంచితే శ్రీలక్ష్మీ అనుగ్రహం లభిస్తుందట.
మరిన్ని వివరాలకు ఈ వీడియో వీక్షించండి: