ఉదయపు సంధ్య వేళ ఆలోచించడం ఉత్తమం, మధ్యాహ్నం ఆ ఆలోచనకు కార్యరూపం ఇవ్వడం, సాయంత్రం తినడం, రాత్రి నిద్రపోవడం ఉత్తమ లక్షణాలు’ అటు ప్రముఖ ఆంగ్ల కవి, పెయింటర్ విలియం బ్లేక్ ఇచ్చిన సందేశం పూర్తిగా తప్పని వైద్యులు తేల్చారు. రోజు వారిగా ఉండే పని ఒత్తిడి కారణంగా మధ్యాహ్నం కాస్త అలా నిద్ర పోవాలనిపిస్తుంది, పొద్దున్నే ప్రారంభమైన మన దినచర్య సాయంత్రం వరకు బిజీగా ఉంటుంది. బాగా అలసిపోయినప్పుడు శరీరం రెస్ట్ కోరుకుంటుంది. మధ్యాహ్నం గంటపాటు నిద్రపోవడాన్ని సియస్టా అంటాం. ఇలా ఒక గంటపాటు నిద్రపోవడం వల్ల శరీరం రిఫ్రెష్‌మెంట్ అవుతుంది. తిరిగి శక్తిని కూడగట్టుకోవడానికి కారణమవుతుంది. దీంతో యాక్టివ్‌గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉదయం, సాయంత్రం, రాత్రి అనే సమయం అనేది లేకుండా పని చేసే వాళ్లకు మధ్యాహ్నం నిద్ర చాలా అవసరం.
శరీరం అలసటకు గురవుతుందో అప్పుడు ఒక గంట నిద్రపోవడం మంచిది. మనం తీసుకున్న ఆహారం అరుగుదలకు నిద్ర తోడ్పడుతుంది. అలాగే ఎక్కువసేపు పని చేయడానికి సహాయం చేస్తుంది. చదువుకునేవారికి మధ్యాహ్నం నిద్ర చాలా ఉపయోగకరం బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది. గుండే మీద ఒత్తిడి కూడా తగ్గిలేచేస్తుంది. మధ్యాహ్నం గంటన్నర నిద్రపోయే అలవాటు చేసుకుంటే, నరాల కదలిక బాగా ఉంటుందట. మధ్యాహ్నం నిద్రపోయేవారిపై ఒక రీసెర్చ్ చేసి స్టెట్‌మెంట్ ఇచ్చారు డాక్టర్లు.
బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రులు విన్‌స్టన్ చర్చిల్, మార్గరెట్ థాచర్ వారిద్దరికి మధ్యాహ్నం భోజనానంతరం నిద్రపోవడం అలవాటు. అత్యవసర సమయాల్లో కూడా వారు ఆ అలవాటు మానుకోలేదు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు తనకు నిద్రాభంగం కలిగించకూడదంటూ థాచర్ అధికారికంగా హుకుం కూడా జారీ చేశారట.