ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏదైనా సాధించగలమనే ఉద్దేశంతో ఈ మాట అంటుంటారు. ఈ రోజుల్లో కోట్లు సంపాదించిన వాళ్లు కాదు.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వాళ్లు నిజమైన ఐశ్వర్యవంతులు.
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏదైనా సాధించగలమనే ఉద్దేశంతో ఈ మాట అంటుంటారు. ఈ రోజుల్లో కోట్లు సంపాదించిన వాళ్లు కాదు.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వాళ్లు నిజమైన ఐశ్వర్యవంతులు. అందుకే తినే ఆహారంలో మంచి క్యాలరీస్ ఉండే పదార్థాలను తీసుకోవాలి. అలాగే ఆహారంతో పాటు పండ్లు తీసుకోవాలి. పండ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మన జీర్ణక్రియను శుద్ధి చేయడమే కాకుండా శరీరానికి పోషకాలతో పాటు అందాన్ని, ఆయుషును పెంచుతాయి. ముఖ్యంగా విటమిన్స్ అధికంగా ఉండే పండ్లను తీసుకోవడం వల్ల రక్త హీనతకు గురికాకుండా కాపాడతాయి. ఇలాంటి ఫ్రూట్స్ వల్ల అలసట కూడా ఏర్పడదు. అటువంటి కాయల్లో నల్ల జామ ఒకటి.
ఏంటీ నల్ల జామ కాయలా..? ఆ కలర్ జామ కాయలు కూడా ఉన్నాయా అని ఆలోచిస్తున్నారా..? మాకు తెలిసి నాటు జామ, తైవాన్ జామలే కదా.. అని మనస్సులో అనుకుంటున్నారా. ఉన్నాయండీ. అయితే నల్లజామ గురించి ఎవ్వరికీ అంతగా తెలియకపోయి ఉండొచ్చు. కానీ భారత్‌లో కొన్ని ప్రాంతాల్లో ఈ పంటను పండిస్తున్నారు. ఇందులో అధికంగా పోషకాలు ఉంటాయి. పైన నల్లగా ఉన్న ఈ జామ లోపల ఎర్రటి గుజ్జుతో ఆకట్టుకుంటుంది. ఇందులో యాంటిఆక్సిడెంట్లు,ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో మరో విశేషమేమిటంటే.. ఈ జామ కాయను అభివృద్ధి చేసింది మన శాస్త్రవేత్తలే. బీహార్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ కాయను అభివృద్ధి చేశారు.
ఈ జామలో విటమిన్ సి, విటమిన్ ఎ, బి, ఇతర మల్టీ విటమిన్లతో పాటు మినరల్స్, అత్యధిక మోతాదులో కాల్షియం, ఐరన్, కొంత మొత్తంలో ప్రొటీన్ లభిస్తుంది. ఇవి తింటే శరీరంలో వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపించవట. జీర్ణ సంబంధింత సమస్యలతో బాధపడే వారు ఈ జామకాయలు తింటే ఉపశమనం లభిస్తుందట. డయాబెటిస్‌తో బాధపడేవారు ప్రతి రోజు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రిస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉండదట. రక్తహీనత తగ్గి.. ఎర్రరక్త కణాల సంఖ్య పెరుగుతుంది. మలబద్ధకం, ఇతర ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. అయితే వీటి ధర మామూలు జామ కాయలతో పోలిస్తే కాస్త ఎక్కువనే చెప్పాలి.