సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని పెద్దలు అన్నారు . మానవ జీవితంలో కన్నుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కంటి చూపుతోనే ప్రతి పనిని చేసుకుంటున్నాము. కంటి చూపు లేకపోతే జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతుంది. కంట్లో చిన్న నలుసు పడినా కూడా తట్టుకోలేము. అలాంటిది ఓ బాలిక కంట్లో నుంచి పేపర్ ముక్కలు, ఇనుప ముక్కలు వంటివి రావడం సంచలనంగా మారింది.

సాధారణంగా ఎవరైనా ఏడ్చినపుడో, లేదా కంటి సమస్య వచ్చినప్పుడు కంట్లో నుంచి నీరు రావడం మనం చూస్తుంటాం. కానీ ఆ బాలిక కంట్లో నుంచి ప్లాస్టిక్ వస్తువులు, ఇనుప ముక్కలు, పేపర్ల వంటివి కంటి నుంచి వస్తున్నాయి. ఈ వింత ఘటన మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలం రాజోలు గ్రామంలో చోటుచేసుకుంది. రాజోలు గ్రామానికి చెందిన భూక్య దశ్రు-దివ్య దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారిలోని చిన్న పాప సౌజన్య. అయితే ఈ పాప వాల్లమ్మ పుట్టిల్లైన గార్ల మండలం పెద్ద కిష్టపురం గ్రామంలో ఉంటోంది. స్థానికంగా ఉన్న పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. అయితే ఉన్నట్టుండి ఈ పాప ఓ వింత వ్యాధిబారిన పడింది. మూడు నెలల కిందట సౌజన్యకు కంటి నొప్పి వచ్చి కంట్లో నుంచి ఓ పత్తి గింజ బయటకొచ్చింది.
తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న బాలికను చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వెంటనే బాలికను వైద్యం నిమిత్తం ఖమ్మం తరలించారు. అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. దీంతో కంటి సమస్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. అయితే తాజాగా శనివారం తెల్లవారుజామున మళ్లీ ఒక్కసారిగా కంట్లో నుంచి బియ్యం గింజలు, ఇనుప ముక్కలు, పేపర్ ముక్కలు, ప్లాస్టిక్ ముక్కలు రావడం జరిగింది. ఈ వింత వ్యాధిని చూసేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున బాలిక ఇంటికి వస్తున్నారు. ఈ వ్యాధి నుంచి తమ బిడ్డను రక్షించాలని బాలిక తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. మరి ఇలాంటి వింత వ్యాధిపై వైద్యులు ఏం తేలుస్తారో చేచి చూడాల్సి ఉంది.